Latest Updates
-
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
టేస్టీ గోభి మంచూరియా.. ఈ వీకెండ్లో చేసుకుందామా..? చాలా సింపుల్..!
వీకెండ్లో సాయంత్రం తినడానికి లేదా నెట్‌ఫ్లిక్స్ లో మంచి సినిమా చూస్తూ ఎంజాయ్ చేసే సమయంలో తినడానికి టేస్టీ స్నాక్ ఐటమ్ ఏదైనా వుంటే చాలా మంచి కిక్ ఇస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకొని గోబీ మంచూరియాను ఎలా చేయాలో మీకు వివరించాలని నిర్ణయించుకున్నాం. గోబీ మంచూరియా చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. ఇంట్లో వున్న వంట వస్తువువలతోనే గోబీ మంచూరియా చేసుకోవచ్చు.
మార్కెట్లో మంచి కాలిఫ్లవర్‌ను సెలక్ట్ చేసుకొని, కడిగి దాన్ని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ప్రస్తుతం ఒక కాలిఫ్లవర్‌తో మాత్రమే గోభీ మంచూరియాను చేసుకుందాం. మొత్తం కట్ చేసిన గోబి రెండు కప్పులు వచ్చే విధంగా చూసుకోవాలి.

ఇప్పుడు గోభిని ఉడికించడానికి ఒక ప్యాన్‌లో తగినన్ని నీళ్లు తీసుకొని స్టవ్‌పై పెట్టి ఆ నీళ్లను ఉడికించాలి. అందులో ఒక టీస్పూన్ ఉప్పు వేసి కలిపిను తరువాత కడిగిన గోభిని ఆ ప్యాన్ నీటిలో వేసి బాగా కలుపుకోవాలి. గోభి మరీ ఎక్కువగా ఉడకకుండా నార్మల్‌గా ఉడికేంతవరకు చూసుకోవాలి. ఉడికిన తరువాత ఆ గోభిని ఒక బౌల్లోకి తీసుకోవాలి.
ఇప్పుడు బౌల్లో గోబిని మారినేట్ చేయబోతున్నాం. బౌల్లో గోబి వేసుకున్న తరువాత అందులో రెండు టేబుల్ స్పూన్ల మైదపిండిని, 3 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్‌ను వేసుకోవాలి. రుచి కోసం తగినంత ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు బౌల్లో వున్న గోబిని, వేసిన పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం గోబీలకు పిండి అంటేలా కొన్ని నీళ్లు చల్లుకుంటూ మారినేట్ చేసుకోవాలి.
మారినేట్ చేసిన గోభిని ఫ్రై చేయడానికి ఒక ప్యాన్‌లో తగినంత నూనె పోసుకోవాలి. నూనె బాగా కాగిన తరువాత గోబీలను నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోబీలు మాడిపోకుండా వుండాలంటే మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. గోబి క్రిస్పీగా రావడానికి రెండు సార్లు ఫ్రై చేసుకోవాల్సి వుంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్‌లోనే గోబిని నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి.
ఫ్రై చేస్తున్నప్పుడు గోబి కలర్ కొంత మారుతుంది. గోబి మొత్తం మాడిపోకుండా గోబిలు క్రిస్పీగా కాగానే ప్యాన్లోంచి బయటకు తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి.
ఇప్పుడు గోభి మంచూరియాకు స్పైసీని యాండ్ చేయడానికి ఒక ప్యాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల మంచి నూనె వేసుకొని కాగిన తరువాత అందులో తగినంత అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేయాలి. టేస్ట్ కోసం రెండు టేబుల్ స్పూన్ల టమాటో సాస్‌ను వేసుకోవాలి. అందులోనే ఒక టీస్పూన్ సోయా సాస్, ఒక టీస్పూన్ రెడ్ చిల్లీ సాస్, ఒక టీస్పూన్ వెనిగర్‌ను యాడ్ చేసి కలుపుకోవాలి.
స్టవ్‌ను హై ఫ్లేమ్‌లో పెట్టి దీన్ని ఫ్రై చేసుకోవాలి. అందులో తగినంత ఉప్పు, మిరియాల పొడిని యాడ్ చేసకోవాలి. కలుపుకుంటున్న ఫ్రై చిక్కగా అయ్యేందుకు ఒక కప్పు కార్న్‌ఫ్లోర్‌లో కొన్ని నీళ్లు కలుపుకొని అదే ప్యాన్‌లో వేసి మళ్లీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం చిక్కని సాస్‌లా తయారైన తరువాత అందులో గోబిని వేసి బాగా కలుపుకోవాలి. గొబికి సాస్ మొత్తం కోట్ అయ్యేలా కలుపుకోవాలి. దీంతో గోబి మంచూరియా రెడీ. టేస్ట్ కోసం ఉల్లిపాయలను, నిమ్మకాయను యాండ్ చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
