Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
గోధుమై అడై దోస చిటికెలో రెడీ - కొబ్బరి చట్నీ లేదా టమోటో చట్నీతో సూపర్ గా ఉంటుంది
మీ ఇంట్లో ఉదయం ఇడ్లీ, దోసె వేయడానికి పిండి లేదా?మరి ఏమి టిఫిన్ చేయాలని అని ఆలోచిస్తున్నారా? మీ ఇంట్లో గోధుమ పిండి ఉంటే చాలు? తర్వాత ఆ గోధుమపిండితో రుచికరమైన మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ తయారుచేసుకోవచ్చు. దానికి దోసె, చపాతీ చేయకండి, దానితో అడి చేయండి. ఇది తయారు చేయడం చాలా సులభం. ఎలాంటి శ్రమ అవసరం లేదు. త్వరగా కూడా అవుతుంది.
గోధుమ అడై దోస ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? గోధుమ అడై దోస రెసిపీ కోసం క్రింద ఒక సాధారణ వంటకం ఉంది. చదివి రుచి చూసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.

కావాల్సిన పదార్థాలు పదార్థాలు:
* గోధుమ పిండి -2 కప్పులు
* వెల్లుల్లిపాయలు 2, జీకలర్ర 1టీస్పూన్, ఎండు మిర్చి 4, ఉప్పు
కొద్దిగా(పేస్ట్ చేసుకోవాలి)
* క్యారెట్ తురుము - 1 కప్పు
* ఉల్లిపాయలు - 3 (సన్నగా తరిగినవి)
* టమోటో - 2 (సన్నగా తరిగినవి)
* పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగినవి)
* కరివేపాకు - కొద్దిగా (సన్నగా తరిగినవి)
* కొత్తిమీర - కొద్దిగా (సన్నగా తరిగినవి)
* ఉప్పు - రుచి ప్రకారం
* నీరు - అవసరమైన పరిమాణం
* నూనె - 2 టేబుల్ స్పూన్లు
తయారుచేయు విధానం:
* ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండిని తీసుకోవాలి. సరిపడా నీళ్ళు పోసి
దోసె పిండిలా చిక్కగా కలుపుకోవాలి
* తర్వాత జార్ లో ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఉప్పు వేసి
గ్రైండ్ చేసుకోవాలి.
* ఈ పేస్ట్ ను గోధుమపిండిలో వేసి బాగా కలపాలి.
* తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు,
కొత్తిమీర, క్యారెట్ తురుము
* స్టౌ మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి, సోపుదినుసులు
వేసి వేగిన తర్వాత అందులోనే ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లి,
పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్, కొత్తిమీర వేసి వేయించాలి.
* అలాగే రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు కూడా వేసి లైట్ గా వేగించి స్టౌ
ఆఫ్ చేయాలి. అంతలోపు..
* ఒక గిన్నెలో కలిపి పెట్టుకున్న గోధుమ పిండిలొ వేగించిన పదార్థాలు
వేసి బాగా కలుపుకోవాలి.
* తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, గోధుమ పిండి మిశ్రమాన్ని దోసెలా
వేయాలి.
* తర్వాత దోసె మీద, దోసె చుట్టుూతగినంత నూనె వేయాలి.
* మీడియం మంట మీద ఉంచి, బంగారు రంగు వచ్చేవరకు ఉడికించుకుంటే,
రుచికరమైన అడై దోసె రెడీ. అదేవిధంగా మొత్తం పిండిని ఇలా దోసెల్లా
కాల్చుకోండి.
* రెండు వైపులా బాగా కాల్సి వేడిగా సర్వ్ చేయాలి. .
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
