Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
హైదరాబాద్ స్టైల్ మటన్ పాయ సూప్..బ్యాచిలర్స్ కూడా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూడండి
నాన్ వెజ్ తినేవాళ్లు చాలామంది మటన్ పాయ సూప్ అంటే పడి చచ్చిపోతారు. మటన్ పాయ అంటే గొర్రె కాళ్లు. గొర్రె కాళ్లు మృదువుగా ఉంటాయి..వాటినే మటన్ పాయా అని అంటారు. మటన్ పాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
అయితే హైదరాబాదీ స్టైల్ లో మటన్ పాయ సూప్ చేసుకోవడం చాలా ఈజీ. బ్యాచిలర్స్ కూడా ఆడుతూ పాడుతూ బెస్ట్ టేస్ట్ తో మటన్ పాయ సూప్ ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

కావల్సినవి
మేక కాళ్లు-2
ఆయిల్- 3 టేబుల్ స్పూన్స్
యాలకులు- 2
లవంగాలు- 2
దాల్చిన చెక్క- 1 ఇంచు
మిరియాలు- 1/2 టీస్పూన్
జీలకర్ర- అర టీస్పూన్
వెల్లుల్లి- పెద్దగా తరుక్కున్నవి 6
అల్లం తరుగు- 1 టీస్పూన్
ఉల్లిపాయ -1 మీడియం సైజుది
ధనియాలు- 1 టేబుల్ స్పూన్
పసుపు- 1/2 స్పూన్
బిర్యానీ ఆకు-1
తయారీ విధానం
-ముందుగా కుక్కర్ లో మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసి వేడి
చేసుకోవాలి.
-నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులో రెండు యాలకులు, రెండు
లవంగాలు,దాల్చిన చెక్క ఒక ముక్క, అర టీస్పూన్ మిరియాలు,అర టీస్పూన్
జీలకర్ర వేసి, పెద్దగా తరగిన 6 వెల్లుల్లి,ఓ టీ స్పూన్ సన్నగా తరగిన
అల్లం వెల్లుల్లి వేసి వేపండి.
-అల్లం వెల్లుల్లి కాస్త మగ్గితే చాలు. ఆ తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ
చీలికలు అందులో వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపండి.
ఉల్లిపాయలు వేగే సమయంలోనే ఓ టేబుల్ స్పూన్ ధనియాలు,బిర్యానీ ఆకు ఒకటి
అందులో వేసుకోండి.
-ఉల్లిపాయ రంగు మారిన తర్వాత బాగా శుభ్రం చేసిన రెండు మేక కాళ్లను
అందులో వేసి హై ప్లేమ్ మీద రెండు నిమిషాలు వేపండి. ఆ తర్వాత మూడు
నుంచి నాలుగు నిమిషాల పాటు మీడియం మంట మీద వేపాలి. మేక కాళ్లను
నిదానంగా వేపాలి లేకుంటే నీచు వాసన వస్తుంది.
-ఇఫ్పుడు ఉప్పు,పసుపు వేసి ఒక నిమిషం వేపండి. ఆ తర్వాత ఓ లీటర్ మంచి
నీరు అందులో పోయాలి. రెండు కట్టలు పుదీనా వేర్లతో సహా కాడలు
వేసేయండి.
-తర్వాత కుక్కర్ మూత పెట్టండి.8 నుంచి 10 విజిల్స్ కేవలం సిమ్ లోనే
ఉడకనివ్వాలి. అప్పుడే ఎముకల్లోని సారం అంతా సూప్ లోకి దిగుతుంది. 8
నుంచి 10 విజిల్స్ రావడానికి దాదాపు 30 నిమిషాలు పడుతుంది.
-ఇప్పుడు స్టవ్ ఆపేయండి. స్టీమ్ అంతా పోనివ్వండి. స్టీమ్ పోయాక
కుక్కర్ మూత ఓపెన్ చేసి మూత ఓపెన్ చేసి మళ్లీ స్టవ్ ఆన్ చేయండి.
- ఇప్పుడు ఇందులో 5 నుంచి 6 పచ్చి మిర్చీల పేస్ట్ వేసుకోండి. రెండు టీ
స్పూన్ల బాదం పేస్ట్ వేసుకోండి.నాలుగు నుంచి ఐదు నిమిషాలు బాగా
ఉడకనివ్వండి.
-తర్వాత స్టవ్ మీద నుంచి కుక్కర్ ని దింపి ఓ జల్లెడలో వేసి
వడకట్టండి.
-ఇప్పుడు సర్వ్ చేసే బౌల్ లో మెత్తగా ప్లేవర్ తో నిండి ఉన్న ఆ
మేకకాళ్లను వేయండి. దాని మీద వేడి వేడిగా సూప్ పోసి సర్వ్
చేసుకోండి.
-అంతే టేస్టీ మేక కాళ్ల సూప్ రెడీ. ఇది నాన్ తో, జొన్న రొట్టెతో లేదా
సూప్ గా కూడా ఆస్వాదించవచ్చు. పిల్లలు కూడా దీనిని బాగా ఎంజాయ్
చేస్తారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
