Latest Updates
-
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.!
Kanuma special recipe: కనుమ స్పెషల్ నాటుకోడి పులుసు.. సులభంగా ఇలా చేసుకోండి!
కనుమ రోజు చాలా మంది విందు భోజనం చేస్తుంటారు. మాంసాహారంతో ఇంటికి వచ్చిన అతిథులను విందు ఇస్తారు. కనుమ రోజు చేసుకునే వంటల్లో ముఖ్యంగా నాన్ వెజ్ వంటలు ప్రత్యేకం. అందులో ముఖ్యమైనది నాటుకోడి పులుసు. కనుమ రోజున నాటుకోడి పుసును చేసుకొని తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా ఈ నాటుకోడి పులుసు చాలా మంచిది. ఇంతకీ ఈ నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? కనుమ స్పెషల్‌గా దీనిని ఎలా చేసుకోవాలి అనేది ఈ స్టోరీలో చెప్పాము. పూర్తిగా చదవండి.

నాటుకోడి పులుసు కావాల్సిన పదార్థాలు:
నాటుకోడి - 1 కిలో
మిరియాల పొడి - 1 టేబుల్ స్పూన్
కారం పొడి - 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర తాలూకు - 1 టేబుల్ స్పూన్
కరివేపాకు - కొద్దిగా
ఉల్లిపాయ - 2
తోటకూర - కొద్దిగా
పసుపు - 1/2 టీస్పూన్
అల్లం - చిన్న ముక్క
వెల్లుల్లి - 5 రేబలు
దోసకాయ - 1
నిమ్మకాయ - 1
కొబ్బరి తురుము - 1/2 కప్
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత
నాటుకోడి పులుసు తయారీ విధానం:
ముందుగా కిలో నాటుకోడిని శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత పాత్రలో నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో అందులో అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఆ అల్లం, వెల్లుల్లి రెబ్బలు లేత గోధుమ రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి కూడా లేత బంగారు రంగులోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. అలాగే అందులోని కరివేపాకులు, కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి.
ఆ తరువాత ఆ మిశ్రమంలో కట్ చేసుకొని పెట్టుకున్న నాటుకోడి ముక్కలను వేసుకోవాలి. వాటిని బాగా వేయించుకోవాలి. అందులో పసుపు, మిరియాల పొడి, కారం వేసుకొని అవి మొత్తం ముక్కలకు సరిగ్గా కలిసే విధంగా కలుపుకోవాలి. అలాగే అందులో కొంచెం నీరుపోసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి.
కూర మృదువుగా అయ్యాక మూత తీసి అందులో కొబ్బరి తురుము వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తరువాత రుచికి తగినంత ఉప్పు వేసుకోని బాగా కలుపుకోవాలి. చివరగా తోటకూర, దోసకాయ ముక్కలు వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఆ తరువాత నిమ్మరసం పిండుకొని.. ఒక్క నిమిషం ఉడికించుకొని సర్వ్ చేసుకుంటే కనుక ప్రత్యేకమైన నాటుకోడి పులుసు సిద్ధమైనట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
