Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
మీ జీవితంలో ఇలాంటి సాంబార్ తిని ఉండరు, టేస్ట్ అదరహో, ఎలా చేసుకోవాలో తెలుసా?
పప్పు, సాంబార్ చాలా మందికి ఇష్టమైన కాంబినేషన్. అన్నంలో పప్పు ఉందంటే కచ్చితంగా సాంబార్ ఉండాల్సిందే. అయితే ఎప్పుడూ ఒకేరకమైన సాంబార్ తిని బోర్ కొడుతుందా? ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఆంధ్రలో ఎంతో ప్రత్యేకమైన మామిడి పప్పు సాంబార్ తినాల్సిందే. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. చేసుకోవడం కూడా ఈజీ. ఈ స్టోరీలో ఈ మామిడి పప్పు సాంబార్ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మామిడి పప్పు కావలసిన పదార్థాలు:
కందిపప్పు: ఒక కప్పు
మామిడికాయ: 1 (చిన్న ముక్కలుగా కోయాలి)
ఉల్లిపాయ: 1 (సన్నగా తరగాలి)
టమాటా: 1 (ముక్కలుగా కోయాలి)
పచ్చిమిర్చి: 2 (చీలికలు చేయాలి)
కరివేపాకు: 2 రెబ్బలు
చింతపండు: చిన్న నిమ్మకాయ సైజు అంత
పసుపు: అర టీస్పూన్
కారం: ఒక టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు: ఒక టీస్పూన్
జీలకర్ర: అర టీస్పూన్
మెంతులు: పావు టీస్పూన్
ఇంగువ: చిటికెడు

తయారుచేయు విధానం:
- ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్‌లో వేసి, తగినంత నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. అలాగే చింతపండును నీళ్లలో నానబెట్టి రసం తీయాలి.
- ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె వేడి చేయాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
- ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటా ముక్కలు, మామిడికాయ ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి.
- ఆ తరువాత చింతపండు రసం పోసి బాగా కలపాలి. అలాగే ఉడికించిన కందిపప్పును వేసి బాగా కలపాలి. అనంతరం సాంబారును 5-10 నిమిషాలు ఉడికించాలి. అంతే ఎంతో రుచికరమైన మామిడి పప్పు సాంబార్ రెడీ అయినట్లే. దీనిని అన్నంలో వేసుకొని తింటే, అబ్బా అనాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications