Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
మన పూర్వికులు డజన్ల కొద్దీ పిల్లలను కనడానికి ఈ రొట్టెనే తినేవారు.. శక్తి డబుల్,ఎలా చేసుకోవాలంటే?
ప్రస్తుతమైతే అందరూ రసాయనాలు వాడిన ఆహార పదార్థాలు తింటున్నారు కానీ, మన పూర్వికులు మాత్రం స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకునే వారు. వారే జొన్నలు, సజ్జలు, రాగులు, వరి పండించి, వారే వాటిని ఆడించుకొని మరీ తినే వారు. అందుకే వారు ఎలాంటి రోగాలు లేకుండా వందల సంవత్సరాలు జీవించగలిగారు. దీంతో పాటు డజన్ల కొద్దీ పిల్లలకు జన్మనివ్వగలిగారు. అలాంటి ఆహారాల్లో ఒకటి సజ్జ రొట్టె.
ఈ సజ్జ రొట్టె ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి కావాల్సిన పోషకాలన్నిటినీ ఇది అందజేస్తుంది. షుగర్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. వేడిని తగ్గించి వీర్యకణాల వృద్ధి సరిగ్గా ఉండే విధంగా, సక్రమంగా సంతానం పొందే విధంగా సహాయపడుతుంది. ఇప్పటి వరకు చాలా మంది చపాతీ, జొన్నరొట్టె చేసుకోవడం మాత్రమే తెలుసు. కానీ ఈ సజ్జరొట్టెను ఎలా చేసుకోవాలో తెలియదు. ఈ స్టోరీలో మేము వివరించాము పూర్తిగా చదివి తెలుసుకోండి.

సజ్జ రొట్టె తయారీకి కావాల్సిన పదార్థాలు
సజ్జ పిండి - 1 కప్పు
గోధుమ పిండి - 1/4 కప్పు (ఐచ్ఛికం)
ఉప్పు - రుచికి తగినంత
నూనె - 1 టేబుల్ స్పూన్
నీరు - తగినంత
తయారీ విధానం:
ముందుగా ఒక పాత్ర తీసుకోవాలి. అందులో ఒక కప్పు సజ్జ పిండి, పావు కప్పు గోధుమ పిండి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆ తరువాత ఆ పిండిని బాగా కలుపుకోవాలి. అనంతరం ఆ పిండిని కొద్దీ కొద్దిగా నీరు కలుపుతూ.. మరీ లూజ్ కాకుండా, మరీ టైట్‌గా కాకుండా పిండిని కలుపుకోవాలి.
ఆ తరువాత ఆ పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆ తరువాత ఆ ఉండలను రొట్టెలు చేసుకోవాలి. ఆ రొట్టెలను పెనంపై వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. కాలే సమయంలో వాటిపై కొద్దిగా నూనె పూసుకొని మృదువుగా కాల్చుకుంటే.. ఎంతో శక్తినిచ్చే.. పోషకాల కొండ అయిన సజ్జ రొట్టె సిద్ధమైనట్లే. ఈ రొట్టెలను పప్పు లేదా ఏదైనా కూరలో తింటే మాత్రం ఆహా అనాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications