Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
శరీరానికి పోషకాలు కావాలంటే ఈ కిచిడి తినాలి.. సులభంగా ఎలా చేసుకోవాలంటే?
ఓట్స్‌తో చాలా రకాల వంటకాలు చేసుకుంటుంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. ఓట్స్‌తో ఎలాంటి వంటకం అయినా చాలా సులభంగా, వేగంగా చేసుకోవచ్చు. అందులో ఓట్స్ కిచిడి కూడా ఒకటి. సమయం ఎక్కువగా లేనప్పుడు ఆరోగ్యకరమైనది తినాల్సి వచ్చేటప్పుడు ఈ ఓట్స్ కిచిడి చేసుకొని తినొచ్చు. ఇది చాలా రుచికరంగా ఉండడంతో పాటు, పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా ఈ ఓట్స్ కిచిడీని తింటారు. సులువుగా జీర్ణం కూడా అవుతుంది. ఈ కిచిడిని ఎలా చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్ కిచిడికి కావాల్సిన పదార్థాలు
- అరకప్పు ఓట్స్
- పావుకప్పు పెసరపప్పు
- అరకప్పు బీన్స్, బంగాళాదుంపలు, క్యారెట్ ముక్కలు
- సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ
- కొన్ని పచ్చి బఠాణీలు
- అర టీస్పూన్ జీలకర్ర
- అర టీస్పూన్ ఆవాలు
- సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి
- ఒక టేబుల్ స్పూన్ అల్లం
- రెండు కప్పుల నీరు
- తగినంత ఉప్పు
- కాస్త కొత్తిమీర

ఓట్స్ కిచిడి తయారీ విధానం
ముందుగా పెసరపప్పును బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత ఆ పెసరపప్పును ఓ పాత్రలో వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. పెసరపప్పు ఉడికిన తరువాత వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి.. అందులో నూనె లేదా, నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. అందులో ముందుగా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి.
ఇప్పుడు అవి చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ, కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం, పచ్చి మిర్చి వేసుకోవాలి. ఇవి లేత బంగారు వర్ణంలో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తరువాత అందులో మనం కట్ చేసుకున్న కూరగాయల ముక్కలు, పచ్చి బఠాణీలు, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని మూడు నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఉడికించుకున్న పెసరపప్పు, ఓట్స్ వేసుకోవాలి. అలాగే నీళ్లు కూడా పోసుకొని కలుపుకోవాలి. ఆ తరువాత ఓట్స్ మెత్తబడి వరకు.. మూత పెట్టుకొని సుమారు ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
బాగా ఉడికిన తరువాత.. దానిపై ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా చల్లుకొని కడాయిని దించుకోవాలి. అంతే టేస్టీగా ఉండే ఓట్స్ కిచిడి సిద్ధమైనట్లే. దీనిని అలాగే వేడి వేడిగా తినేయొచ్చు. ఇది రుచికరంగా ఉండడంతో పాటు, పోషకాలు కూడ పుష్కలంగా దొరుకుతాయి.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. మేము కేవలం సమాచారం అందించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. దీనికి బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications