Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
పాలక్, బీట్రూట్తో పరోటా.. ఆ మధ్యలో పనీర్ స్టఫ్ చేస్తే ఒకటికి రెండు తినాల్సిందే.!
దాబా స్టైల్ పరోటా అంటే చాలా మందికి ఫేవరెట్. తక్కువ ఆయిల్ వాడుతూ లేయర్స్‌గా, పొడిపొడిగా ఉండే పరోటాని ఎక్కువగా డిన్నర్‌లోకి ఇష్టపడుతుంటారు. ఇప్పుడు పరోటాని చాలా హెల్తీగా పాలకూర, బీట్రూట్తో కలిపి చేసుకుంటే చిన్న పిల్లలు సైతం లొట్టలేసుకుంటూ తినేస్తారు. ఇంకా శరీరానికి ప్రొటీన్లు పుష్కలంగా అందేలా పనీర్‌ను సైతం జత చేసుకుంటే ఆ టేస్ట్ అమోఘం. పాలక్ బీట్రూట్ పనీర్ పరోటాను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..

పాలక్ బీట్రూట్ పనీర్ స్టఫ్డ్లో ముందుగా చపాతీ పిండి ముద్దకి కావాల్సిన పదార్థాలు
పాలకూర- రెండు కట్టలు
బీట్రూట్- రెండు
గోధుమ పిండి- ఒక కప్పు
పనీర్ స్టఫ్‌కి కావాల్సిన పదార్థాలు
పనీర్- 100 గ్రాములు
కారం- టీ స్పూన్
ఉప్పు- టీ స్పూన్
నువ్వులు- టీ స్పూన్
ఉల్లిపాయలు- ఒకటి
పచ్చిమిర్చి- నాలుగు
జీలకర్ర పొడి- టీ స్పూన్
పాలక్ బీట్రూట్ పనీర్ స్టఫ్ తయారీ విధానం
ముందుగా బీట్రూట్ తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. పాలకూరను కట్ చేసి శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఈ రెండింటినీ విడివిడిగా మొత్తగా పేస్ట్‌లా చేసుకోని రెండు గిన్నెల్లో పోసుకోవాలి. ఇప్పుడు మరో రెండు గిన్నెల్లో గోధుమ పిండిని తీసుకుని బీట్రూట్, పాలక్ పేస్ట్, కాస్త ఉప్పు వేసి సెపరేట్‌గా పిండి ముద్దను కలుపుకోవాలి. వాటిని కాసేపు నాననివ్వాలి.
పనీర్ స్టఫ్ తయారీ
ముందుగా పనీర్‌ను తురుముకోవాలి. ఇప్పుడు అందులో కారం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, నువ్వులు, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర పొడి వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి.
పాలక్ బీట్రూట్ పనీర్ స్టఫ్డ్ పరోటా తయారీ విధానం
మొదటగా బీట్రూట్తో చేసిన పిండి ముద్దను తీసుకుని చపాతీ పీటపై కొంచెం పొడి పిండి చల్లుకొని చపాతీలా చేసుకోవాలి. ఇప్పుడు పాలక్ పేస్ట్ పిండి ముద్దతో మరో చపాతీ ముద్దను తీసుకుని చపాతీలా చేసుకోవాలి. ఈ రెండు చపాతీల మధ్యలో పనీర్ స్టఫ్‌ను పరుచుకోవాలి. మళ్లీ చపాతీలా ఒత్తుకుని పాయలుగా కట్ చేసుకుని పరోటాలా చేసుకోవాలి. చివరిగా పెనంపై నూనె రాసి వేడయ్యాక రెండు వైపులా కాల్చుకోవాలి.
అంతే వేడివేడి హెల్తీ బీట్రూట్ పాలక్ పనీర్ పరోటా రెడీ. పెరుగు, పచ్చడి లేదా ఏదైనా సాస్‌తో తింటే రుచిపోతుంది. డైట్ మెయింటైన్ చేస్తూ బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెసిపీ చాలా మంచి ఛాయిస్.
పాలక్, బీట్రూట్, పనీర్ మిశ్రమంతో తయారు చేసిన పరోటాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఒక మీడియం సైజు పరోటాలో దాదాపు 200 కేలరీలు ఉంటాయి. 12 గ్రాముల ప్రొటీన్, 25 గ్రాముల కార్బొహైడ్రేట్లు, 8 గ్రమాలు ఆరోగ్యకరమైన కొవ్వులు, 5 గ్రాముల ఫైబర్ లభిస్తుంది.
ఇందులో ఐరన్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో రక్తహీనతను నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కండరాల నిర్మాణానికి అవసరమైన కాల్షియంను అందిస్తుంది. ఫైబర్‌తో జీర్ణక్రియ సులభంగా అవుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
