Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఇలాంటి పాయసం మీరు రుచి కూడా చూసి ఉండరు, ఉగాదికి చేసుకుంటే అమోఘమే.. ఎలా చేసుకోవాలంటే?
తెలుగు ప్రజలకు ఎంతో ప్రత్యేకమైన, అత్యంత ముఖ్యమైన ఉగాది పండుగ వచ్చేసింది. ఈ రోజున తెలుగు ప్రజలందరూ ఎంతో ఇష్టంగా ఉగాది పచ్చడితో పాటు షడ్రుచుల కాంబినేషన్‌తో కమ్మటి పాయసాలను తింటారు. రకరకాల ఆహారపదార్థాలతో పాయసం చేసుకొని వాటి రుచిని అనుభవిస్తుంటారు. ఆ పాయసం అనేది పండుగ రోజున ప్రత్యేకమైనది. అయితే, ఈ ఏడాది ప్రత్యేకంగా కొత్త రుచి ఉన్న పాయసం రెసిపీ కోసం వెతుకుతున్నారా? అయితే మీరు శనగపప్పు పాయసం ట్రై చేయొచ్చు. ఈ శనగపప్పు పాయసం అనేది పాతకాలం నుంచి తరతరాలుగా వస్తున్న ఒక అచ్చ తెలుగు వంటకం. ఇది ఆరోగ్యకరంగా, చక్కెర లేకుండా చేసే పాయసం. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ తినగలిగే విధంగా ఉంటుంది. అలాగే అందరికీ అందుబాటు ధరల్లో తయారువుతుంది. దీనిని ఎలా చేసుకోవాలి అనేది చాలా మందికి తెలియదు. అందుకే ఈ స్టోరీలో శనగపప్పు పాయసం ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనేది తెలుసుకుందాం.
శనగపప్పు పాయసం తయారీకి కావలసిన పదార్థాలు:
శనగపప్పు - 1 కప్పు
సగ్గు బియ్యం - 1 కప్పు
బెల్లం - 2 కప్పులు
నెయ్యి - 4 టీ స్పూన్లు
జీడి పప్పు - 2 టీ స్పూన్లు
కిస్‌మిస్ - 1 టీ స్పూన్
బాదం పప్పు - 1 టీ స్పూన్
పచ్చ కర్పూరం - చిటికెడు
శనగపప్పు పాయసం తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో సగ్గుబియ్యం వేసి మూడు నుండి నాలుగు గంటలు నానబెట్టండి.
ఈ సమయంలో, శనగపప్పును శుభ్రంగా కడిగి, ఒక గిన్నెలో నీరు పోసి ఒక గంట పాటు నానబెట్టండి.
ఒక కుక్కర్లో శనగపప్పును వేసి, పప్పు మునిగేంత నీరు పోసి, హై ఫ్లేమ్‌లో 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి, కుక్కర్‌ను పక్కన పెట్టండి.
ఇక, సగ్గుబియ్యం నానిన తర్వాత, దాన్ని స్టవ్ మీద పెట్టి, 4-5 నిమిషాలు ఉడికించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి.
మరో పాన్‌లో 2 కప్పుల బెల్లం, నీరు వేసి, బెల్లం కరిగి పాకం వచ్చే వరకు ఉడికించండి. పాకం పూర్తయ్యాక దాన్ని పక్కన పెట్టండి.
ఒక లోతైన గిన్నె తీసుకుని, ఉడికించిన సగ్గుబియ్యంతో పాటు శనగపప్పు వేసి కలపండి. తరువాత 350 మిల్లీ లీటర్ల పాలు పోసి, కాసేపు ఉడికించాలి. పాయసం కొంచెం దగ్గర పడే వరకు ఉంచండి.
పక్కన పెట్టిన బెల్లం పాకాన్ని పాయసం లోకి వేసి బాగా కలపండి.
ఇప్పుడు, ఒక పాన్‌లో నెయ్యి వేసి వేడి చేయండి. అందులో జీడిపప్పు, కిస్‌మిస్, మరియు బాదం పప్పు వేసి వేయించండి. ఇవి మసాలా గా వేయించిన తర్వాత, వాటిని పాయసం మిశ్రమంలో వేయండి.
చివరగా చిటికెడు పచ్చ కర్పూరం వేసి, బాగా కలిపి పాయసాన్ని అందంగా రుచికరంగా తయారు చేసుకోండి.
ఈ రుచికరమైన శనగపప్పు పాయసం మీ ఉగాది పండుగకి ప్రత్యేకంగా తయారవుతుంది. చక్కెర లేకుండా ఈ పాయసం చేసినప్పుడు, ఆరోగ్యం కాపాడుకుంటూ, కొత్త సంవత్సరం ప్రారంభంలో కొత్త రుచిని ఆస్వాదించవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












