Latest Updates
-
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.!
కేవలం 4 వంకాయలతో ఇడ్లీ, దోసెల్లోకి అద్భుతమైన గ్రేవీ..ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు!
ఇడ్లీ లేదా దోసెలోకి ఎప్పుడూ చేసుకునే పల్లీ చట్నీ లేదా కొబ్బరి చట్నీనే తిని తిని బోర్ కొడుతోందా? కొత్తగా, కారంగా, రుచికరంగా ఏదైనా తినాలనిపిస్తోందా? అయితే మీ ఇంట్లో ఒక నాలుగు వంకాయలు ఉంటే చాలు, నిమిషాల్లో ఒక అద్భుతమైన సైడ్ డిష్ తయారు చేసుకోవచ్చు. అదే వంకాయ గ్రేవీ.
సాధారణంగా వంకాయ కూర అంటే ఇష్టపడని వారు కూడా, ఈ స్టైల్ లో గ్రేవీ చేసి పెడితే లొట్టలేసుకుంటూ తింటారు. ఇది ఇడ్లీ, దోసెకే కాదు, వేడి వేడి అన్నంలోకి కూడా అమృతంలా ఉంటుంది. నోరూరించే వంకాయ గ్రేవీ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
వంకాయలు: 4 పెద్దవి
నూనె: 2 టేబుల్ స్పూన్లు
సాంబార్ ఉల్లిపాయలు: 15
వెల్లుల్లి: 5 రెబ్బలు
పచ్చిమిర్చి: 3
టమోటాలు: 2
చింతపండు: చిన్న ఉసిరికాయంత
పసుపు: అర టీస్పూన్
కారం: అర టేబుల్ స్పూన్
ధనియాల పొడి: పావు టేబుల్ స్పూన్).
ఉప్పు: రుచికి సరిపడా.
ఆవాలు - అర టీస్పూన్
మినప్పప్పు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
నీరు - 1 గ్లాసు
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసి వేడి చేయాలి.
-నూనె కాగాక పొట్టు తీసిన చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. చిన్న ఉల్లిపాయలు రంగు మారుతున్నప్పుడు మంచి వాసన వస్తుంది.
-ఇప్పుడు తరిగిన టమోటా ముక్కలను వేసి మెత్తబడే వరకు వేయించాలి.
-టమోటాలు మగ్గిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి బాగా కలపాలి. మూత పెట్టి మీడియం మంటపై 2-3 నిమిషాల పాటు వంకాయ ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు మగ్గనివ్వాలి.
-వంకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత అందులో చింతపండు, పసుపు, కారం, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. మసాలా వాసన పోయేలా మరో 2 నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-చల్లారిన వంకాయ మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి తీసుకుని మెత్తగా పేస్ట్ లా రుబ్బుకోవాలి. మరీ నీళ్లు పోయకుండా గట్టిగానే రుబ్బుకుంటే రుచి బాగుంటుంది.
-తాలింపు కోసం ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. చివరగా కరివేపాకు వేసి వేయించాలి.
-తాలింపు వేగాక, మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న వంకాయ పేస్ట్ ను పాన్ లో వేయాలి. ఇప్పుడు గ్రేవీ చిక్కదనాన్ని బట్టి సుమారు 1 గ్లాసు నీళ్లు పోసి బాగా కలపాలి. మూత పెట్టి చిన్న మంటపై ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి.
-నూనె పైకి తేలుతూ, గ్రేవీ చిక్కబడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే గుమగుమలాడే వంకాయ గ్రేవీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
