Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
శరీరానికి బలం ఇచ్చే ప్రోటీన్ దోశ ఎలా చేస్తారో తెలుసా? సింపుల్లో ఇలా చేసుకోండి!
మీ ఇంట్లో దోశ ప్రియులు చాలా మంది ఉన్నారా? రోజుకి ఒక్కసారైనా ఇంట్లోనే దోశ చేసుకుంటారా? అయితే ఎప్పుడూ ఒకే రకమైన దోశ తిని బోర్ కొడుతుందా? కొంచెం పోషక విలువలు కలిగిన దోశను ఇంట్లోనే తయారు చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఒకసారి ఈ ప్రొటీన్ దోశ చేసుకోండి. దీనిని శెనగపప్పుతో తయారు చేస్తారు. శెనగపప్పులో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి దానిని ప్రోటీన్ దోశ అని పిలుస్తుంటారు. ఈ దోశ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. ఈ ప్రోటీన్ దోశ ఎలా తయారు చేసుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అవసరమైన పదార్థాలు:
* పప్పు - 1 కప్పు
* కరివేపాకు - 1 కట్ట
* మిరపకాయలు - 1
* అల్లం - 1 అంగుళం
* జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
* ఉప్పు - 1 టీస్పూన్
* నీరు - 1 కప్పు
రెసిపీ:
* ముందుగా పప్పును కడిగి కనీసం 8 గంటల పాటు నానబెట్టాలి.
* 8 గంటల తర్వాత పప్పును మిక్సీ జార్లో వేసి కరివేపాకు,
జీలకర్ర, అల్లం, రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా
రుబ్బుకోవాలి.
* తర్వాత మైదా పిండిని ఒక గిన్నెలో పోయాలి.
* అందులో దోశ పిండి వేసుకోవాలి. పిండి మరీ చిక్కగా ఉంటే పిండిలో
కొంచెం నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన
కొత్తిమీర, ఇంగువ పొడి వేసి బాగా కలపాలి.
* చివరగా దోశ పెనంను స్టవ్ మీద పెట్టి.. పెనం వేడయ్యాక పెనంపై నూనె
పోసి.. దోశలు వేసుకుంటే ఎంతో రుచికరమైన ప్రోటీన్ దోశ సిద్ధమైనట్లే.
ఇది తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
