Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
ఎండలో వెళ్ళేటప్పుడు ఈ షర్బత్ తాగి వెళితే వడదెబ్బ తగలదు, చర్మం కూడా నల్లగా మారదు.. ఎలా చేసుకోవాలంటే?
వేసవి ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటే ఎండ వేడిమికి ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. అంత వేడి నుంచి తప్పించుకోవడానికి ప్రజలు చల్ల చల్లని కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, షర్బత్‌లు తాగుతున్నారు. అయితే అందులో ఎక్కువ మొత్తంలో కెమికల్స్ ఉండే అవకాశం ఉండడంతో చాలా మంది వీటిని తినడానికి అవకాశం ఉండడం లేదు. అయితే ఈ ఎండలో వడదెబ్బ తగలకుండా ఉండడానికి, మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలగడానికి చందనంతో చేసుకునే షర్బత్ చాలా ముఖ్యం. దీనిని చాలా సులభంగా, అత్యంత రుచికరంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అయితే ఈ చందనంతో షర్బత్ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చందనంతో షర్బత్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:
చందనం పొడి - 2 టేబుల్ స్పూన్లు
చల్లని నీరు - 2 గ్లాసులు
పంచదార లేదా తేనె - రుచికి సరిపడా
నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
ఐస్ క్యూబ్స్ - కొన్ని
సబ్జా గింజలు (నానబెట్టినవి) - 1 టేబుల్ స్పూన్ (ఐచ్ఛికం)

తయారీ విధానం:
ఒక గిన్నెలో చందనం పొడి, పంచదార లేదా తేనె, నిమ్మరసం, నీరు వేసి
బాగా కలపాలి.
పంచదార లేదా తేనె పూర్తిగా కరిగే వరకు కలపాలి.
ఈ మిశ్రమాన్ని వడకట్టండి.
గ్లాసులలో ఐస్ క్యూబ్స్ వేసి, చందనం షర్బత్ పోయాలి.
నానబెట్టిన సబ్జా గింజలు వేసి బాగా కలపండి.
చల్లగా వడ్డించండి.
కోడిగుడ్డుతో ఈ షేర్వా చేసుకొని తింటే ఒక్క మెతుకు అన్నం కూడా మిగల్చరు.. ఎలా చేసుకోవాలంటే?
చందనం షర్బత్ వల్ల ఉపయోగాలు:
చందనంతో చేసే షర్బత్ తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ షర్బత్ వేసవిలో వడదెబ్బ మరియు నిర్జలీకరణం వంటి సమస్యల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. వేసవి కాలంలో ఎక్కువగా జరిగే ఉదర సంబంధిత వ్యాధులను నిరోధించడంలో కూడా ఈ చందనం షర్బత్ ఎంతో సహాయపడుతుంది. అయితే, దీని ఆరోగ్య ప్రయోజనాలను మరింత తెలుసుకుందాం.
వడదెబ్బ మరియు నిర్జలీకరణం నుండి రక్షణ
వేసవిలో వడదెబ్బ అనేది అత్యంత తీవ్రమైన సమస్య. దీనిని నివారించడానికి చల్లని ఆహారాలు మరియు కూల్ డ్రింక్స్ చాలా ముఖ్యం. చందనం యొక్క శీతలీకర గుణాలు వడదెబ్బను నివారించడంలో సహాయపడతాయి.
జీర్ణక్రియ మెరుగుపరచడం
చందనం షర్బత్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది ఎసిడిటీ, అజీర్ణం, చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలో ఆహారం జీర్ణం చేయడానికి సహాయపడుతుంది.
చర్మం మెరుగుపడుతుంది
చందనం షర్బత్‌ను తరచుగా తాగడం వల్ల చర్మం మరింత ఆరోగ్యంగా మారుతుంది. వేడి కారణంగా చర్మం మీద వచ్చే దద్దుర్లు, ఉబ్బలు వంటివి తగ్గుతాయి. అలాగే చర్మం మరింత యవ్వనంగా, మృదువుగా తయారవుతుంది.
మానసిక ఒత్తిడి తగ్గించడం
చందనం షర్బత్ మనసును ప్రశాంతం చేయడంలో సహాయపడుతుంది. ఒత్తిడి, ఆందోళన, మానసిక అలసట తగ్గుతుంది. మానసిక ఒత్తిడి తగ్గించడం వలన మనిషి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే ప్రతిపనిలోనూ మంచి విజయాన్ని నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.
యూరినరీ సమస్యలు
చందనం షర్బత్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ (మూత్రసంచయం సంబంధిత సమస్యలు) తగ్గించడంలో కూడా ఉపశమనం కలిగిస్తుంది. దీని శీతల గుణాలు మూత్రవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications