Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Sankranti 2025: సంక్రాంతి స్పెషల్ బెల్లం నువ్వుల ఉండలు.. ఎలా చేసుకోవాలంటే?
సంక్రాంతి వచ్చేస్తుంది. ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటి నుంచే సంక్రాంతి ఏర్పాట్లను ప్రతి ఒక్కరూ మొదలుపెట్టేశారు. అందులో భాగంగా సంక్రాంతికి ప్రత్యేకమైన వంటలు చేయడం ప్రారంభించారు. సంక్రాంతికి పిండి వంటలు, స్వీట్స్ ప్రత్యేకంగా చేసుకుంటారు. వాటిల్లో బెల్లం నువ్వుల ఉండలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇవి తినడానికి చాలా తీపిగా ఉంటాయి. అలాగే శరీరానికి కూడా అద్భుతమైన ఫలితాలనిస్తుంది. ఈ బెల్లం నువ్వుల ఉండలు ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బెల్లం నువ్వుల ఉండలు తయారీకి కావాల్సిన పదార్థాలు
నువ్వులు - 1 కప్పు
బెల్లం - 1 కప్పు
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - చిటికెడు
ఎండుమిరపకాయలు - 2-3

తయారీ విధానం:
ముందుగా నువ్వులను శుభ్రంగా కడుక్కొని వరిగించుకోవాలి. వరిగించిన తరువాత వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తరువాత ఓ పాత్రలో బెల్లం వేసి, అందులో కొద్దిగా నీరు పోసి బాగా ఉడికించాలి. బెల్లం కరిగి పాకం పట్టుకోవడానికి అనువైన స్థితికి వచ్చే వరకు వేడి చేసుకోవాలి. ఆ తరువాత కరిగిన బెల్లంలో వరిగించిన నువ్వులు, జీలకర్ర, ఎండు మిరపకాయలు వేసుకొని బాగా కలిపారు.
ఆ తరువాత ఆ నువ్వుల మిశ్రమాన్ని ఉండలుగా చేసుకోవాలి. అనంతరం వాటిపైన నెయ్యి రాశి ప్లేట్‌లో సరిగ్గా అమర్చుకోవాలి. అలా అమర్చుకున్న తరువాత చల్లార్చుకోవాలి. అనంతరం వాటిని ఎయిర్ టైట్ కంటైనర్‌లో నిల్వ చేసుకుంటే ఎంతో రుచికరమైన సంక్రాంతి స్పెషల్ బెల్లం నువ్వుల ఉండవు సిద్ధమైనట్లే.
ఈ బెల్లం నువ్వుల ఉండలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. శరీరానికి కావాల్సిన ఐరన్ అందండంతో పాటు తక్షణ శక్తి అందుతుంది. దీంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో HMPV వైరస్ లాంటి వైరస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications