Latest Updates
-
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా?
సంక్రాతి స్పెషల్ రేగి పండు పచ్చడి.. ఇలా చేసుకుంటే లొట్టలేసుకుని తింటారు!
రేగి పండు గుర్తుందా? చిన్నప్పుడు పొలాల్లో ఈ పండ్లు విచ్చలవిడిగా దొరుకుతాయి. పొలం వైపు వెళ్ళేటప్పుడు రెండు జేబులు నిండా రేగి పండ్లు నింపుకొని తినేవాళ్ళం. సంక్రాంతికి ఈ పండ్లు ఎక్కువగా లభిస్తాయి. అలాగే భోగిలో చిన్న పిల్లల తలపై నుంచి ఈ రేగి పండ్లను పొసే సంప్రదాయం కూడా మన రాష్ట్రాల్లో ఉంది. అయితే ఈ సంక్రాంతి ప్రత్యేకంగా చేసుకునే రేగి పండ్ల పచ్చడి ఎప్పుడైనా తిన్నారా? ఒక్కసారి తింటే జన్మలో దాని రుచి మర్చిపోలేరు. ఒకవేళ మీకు రేగి పండ్ల పచ్చడి చేసుకోవడం తెలియకపోతే ఈ స్టోరీ ఫుల్గా చదివేసి పచ్చడిని తయారు చేసేయండి.
రేగి పండ్ల పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
రేగి పండ్లు - 1 కిలో
ఎండు మిరపకాయలు - 10-12
కరివేపాకు - కొన్ని రెబ్బలు
ఉప్పు - రుచికి తగినంత
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1/2 టీస్పూన్
జీలకర్ర - 1/4 టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 2-3
పసుపు - అరటి చిప్పంత
కారం పొడి - రుచికి తగినంత

రేగి పండ్ల పచ్చడి తయారీ విధానం
ఈ రేగి పండ్ల పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా రేగి పండ్లను శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం వాటిలోని గింజలను తీసేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. అనంతరం వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు కోన్ని ఎండు మిరపకాయలు తీసుకోవాలి. వాటిని కొంచెం నూనెలో వేసుకొని కాస్త వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తరువాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాత్రలో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని తాలింపు కోసం వేయించుకోవాలి. ఆ తరువాత మీకు వీలైతే రోలులో, లేదా మిక్సీలో కోసిన రేగి పండ్లు, వేయించిన ఎండు మిరపకాయలు, కరివేపాకులు, పసుపు, కారం పొడి వేసుకొని బాగా రుబ్బుకోవాలి.
అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పచ్చడిపై ముందుగా చేసి పెట్టుకున్న తాలింపు వేసుకొని బాగా కలిపితే ఎంతో రుచికరమైన నోరూరించే రేగి పండ్ల పచ్చడి సిద్ధమైనట్లే. దీనిని ఒక్కసారి రుచి చూస్తే జీవితంలో మళ్ళీ వదలరు. లొట్టలేసుకుని అన్నం తినాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
