Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
నోరూరించే వంకాయ పచ్చడి.. తలుచుకుంటేనే నోరూరుతుంది! కమ్మగా ఎలా చేసుకోవాలంటే?
తెలుగు రాష్ట్రాల వంటకాల్లో వంకాయ పచ్చడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది రుచిలో మాత్రమే కాదు ఆరోగ్యంలో కూడా ఏ వంటకం చేయని మేలు చేస్తుంది. వంకాయలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వంకాయ పచ్చడిని రోజువారి ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కానీ దీనిని చేసుకోవడం చాలా మందికి తెలియదు. అయితే ఈ స్టోరీలో మేము వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది పూర్తిగా వివరించాము. చివరి వరకు చదివి.. మీ ఇంట్లో ట్రై చేయండి.
వంకాయ పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు:
వంకాయలు - 2
టమోటాలు -2
తగినంత నూనె
జీలకర్ర - 1/2 టీస్పూన్
దాల్చిన చెక్క - చిన్న ముక్క
లవంగాలు - 2
వెల్లుల్లి రెబ్బలు - 2-3
పచ్చిమిర్చి - 2-3
ఉప్పు - రుచికి తగినంత
కారం - రుచికి తగినంత
కరివేపాకు - కొద్దిగా
గరం మసాలా - రుచికి తగినంత

వంకాయ పచ్చడి తయారీ విధానం:
ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఆ ముక్కలను ఓ గిన్నెలో వేసుకోవాలి. అందులో కొంచెం నీళ్లు, ఉప్పు వేసుకొని ముక్కలను వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వంకాయలోని చేదు తొలిగిపోతుంది. రుచికి కూడా డబల్ అవుతుంది.
ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. అందులో జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. అలాగే వెల్లుల్లి, పచ్చిమిర్చిని కూడా పేస్ట్ మాదిరిగా చేసుకొని.. అందులో వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక.. అందులో చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకొని వేయించుకోవాలి. వంకాయలు మెత్తగా అయ్యేవరకు వాటిని వేయించుకోవాలి. ఆ తరువాత ఉప్పు, కారం, కరివేపాకులు కూడా వేసుకోని ఓసారి వేయించుకోవాలి.
అనంతరం ఆ మిశ్రమాన్ని అంతా రోటిలో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మిక్సీలో అయితే కేవలం రెండు చుట్లు మాత్రమే తిరిగే విధంగా దంచుకొని తీసుకొని గిన్నెలో వేసుకోవాలి. ఆ తరువాత ఆ పచ్చడిపై తాలింపు వేసుకుంటే ఎంతో రుచికరమైన, ఆరోగ్యానికి చాలా మేలు చేసే వంకాయ రోటి పచ్చడి సిద్ధమైనట్లే. దీనిని వేడి వేడి అన్నంలో.. కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహ.. ఆ రుచే వేరు. మీరూ ఓసారి ట్రై చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
