Latest Updates
-
నూనెలో డీప్ ఫ్రై లేకుండానే కరకరలాడే మసాలా పల్లీలు..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
మటన్ గిల్లీ బిర్యానీ..వాసనకి పక్కింటోళ్లు కూడా ప్లేట్ పట్టుకుని పరుగెట్టుకొస్తారు! -
ప్రతి రాత్రి సోంపు నీరు తాగుతున్నారా? నెల రోజుల్లో శరీరంలో జరిగే అద్భుత మార్పులివే! -
బియ్యం, మినప్పప్పు లేకుండానే అటుకులతో అప్పటికప్పుడు క్రిస్పీ మసాలా దోసె..అబ్బబ్బబ్బా అనాల్సిందే! -
చలికాలంలో రోజూ ఒక బెల్లం ముక్క తింటే ఏమవుతుంది? రోజుకు ఎంత, ఎలా తినాలో తెలుసా? -
బాలల దినోత్సవం స్పెషల్: ఓవెన్ లేకపోయినా పర్లేదు.. స్టవ్ మీదనే క్రిస్పీగా వేరుశెనగ బిస్కెట్లు చేసుకోండిలా! -
పాస్ వర్డ్ లో కామా పెడితే ఎవ్వరూ హ్యాక్ చేయలేరా? వైరల్ టెక్ ట్రిక్ వెనుక వాస్తవం ఇదే! -
కారంగా, కమ్మగా ఉండే కరివేపాకు చికెన్ రోస్ట్.. ఈ సీక్రెట్ మసాలాతో రుచి డబుల్! -
మన దేశం మధ్యలో ఉండి భారతీయులే వెళ్లలేని వింత గ్రామం..ఎక్కడుంది? ఆ కథేంటి? -
చలికాలంలో పచ్చి బఠానీ ఎందుకు తినాలో తెలుసా?
చూస్తుంటేనే నోరూరిపోయే డబుల్ లేయర్ చాక్లెట్ బర్ఫీ.. ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా!
మన చేతులతో ఇంట్లోనే ప్రేమగా తయారుచేసుకునే స్వీట్ల రుచికి సాటి ఏదీ రాదు. అందుకే ఈసారి సంప్రదాయ రుచిని, ఆధునిక ఫ్లేవర్‌ను కలిపి డబుల్ లేయర్ చాక్లెట్ బర్ఫీని ప్రయత్నించి చూడండి. పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ దాని రుచితో ఇట్టే కట్టిపడేస్తుంది. డబుల్ లేయర్ చాక్లెట్ బర్ఫీ మీ ఇంట్లో తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
మెత్తని వెన్న (సాఫ్ట్ బటర్) - 4 టేబుల్ స్పూన్లు
పాలు - ముప్పావు కప్పు,అదనంగా 1 టేబుల్ స్పూన్
మిల్క్ పౌడర్ - ఒకటిన్నర కప్పులు
చక్కెర - ముప్పావు కప్పు
కోకో పౌడర్ - 1 టేబుల్ స్పూన్
కేవ్రా వాటర్ - కొన్ని చుక్కలు
యాలకుల పొడి - రుచికి తగినంత
వెనీలా ఎసెన్స్ - కొన్ని చుక్కలు
నెయ్యి - గ్రీజింగ్ కోసం

తయారీ విధానం
-ముందుగా ఒక ట్రేలో పార్చ్ మెంట్ పేపర్ వేసి, దానిపై కొద్దిగా నెయ్యి రాసి పక్కన ఉంచండి.
-స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో వెన్న, ముప్పావు కప్పు పాలు వేసి బాగా కలిపి మరిగించండి. తర్వాత అందులో మిల్క్ పౌడర్ వేసి ఉండలు లేకుండా మృదువుగా కలిసేలా తిప్పండి. తర్వాత చక్కెర వేసి, అడుగంటకుండా కలుపుతూ సుమారు 8 నిమిషాల పాటు ఉడికించండి. మిశ్రమం పాన్ కు అంటుకోకుండా ముద్దలా దగ్గరపడే వరకు ఉడికించాలి.
-కొద్దిగా మిశ్రమాన్ని తీసి కాస్త చల్లారనిచ్చి, నెయ్యి రాసిన వేళ్ల మధ్య తిప్పితే మెత్తని ఉండలా రావాలి. బర్ఫీ గట్టిగా కావాలనుకుంటే మరికొద్దిసేపు ఉడికించండి.
-స్టవ్ ఆపేసి పాన్ ను పక్కకు దించండి. ఇందులో సగం మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకోండి. బౌల్ లోని మిశ్రమంలో కేవ్రా వాటర్, యాలకుల పొడి కలిపి, సిద్ధం చేసిన ట్రేలో మొదటి పొరలా సమానంగా పరచండి.
బజార్ స్వీట్లు ఇక ఆపేయండి.. సొరకాయతో అద్భుతమైన కలకండ్ ఇలా చేసుకోండి..
-పాన్ లో మిగిలిన మిశ్రమంలో కోకో పౌడర్, 1 టేబుల్ స్పూన్ పాలు, వెనీలా ఎసెన్స్ వేయండి. తక్కువ మంటపై కలుపుతూ, మిశ్రమం తిరిగి పాన్ కు అంటుకోని ముద్దలా వచ్చేవరకు ఉడికించండి. చల్లారిన కొద్దిపాటి మిశ్రమాన్ని వేళ్లతో చూస్తే మెత్తని ఉండలా రావాలి. వేడిగా ఉన్నప్పుడే ఈ చాక్లెట్ మిశ్రమాన్ని మొదటి లేయర్ పైన వేసి సున్నితంగా సమానం చేయండి.
-దీనిని గది ఉష్ణోగ్రత దగ్గర గంటసేపు చల్లారనిచ్చి, ఆ తర్వాత పూర్తిగా సెట్ అయ్యే వరకు ఫ్రిజ్ లో ఉంచండి.
-చివరగా కత్తికి నెయ్యి రాసి, మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోండి.
-అంతే నోట్లో వేసుకోగానే కరిగిపోయే, కంటికి ఇంపుగా కనిపించే డబుల్ లేయర్ చాక్లెట్ బర్ఫీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
