Latest Updates
-
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం! -
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026 -
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే..
పాతకాలంలో మన తాతలు ఎక్కువగా ఈ పులుసు తినేవారు, చాలా చీప్ కానీ ఎక్కువ లాభాలు, ఎలా చేసుకోవాలంటే?
మన వంటింట్లో ఉండే కూరగాయల్లో ముఖ్యమైనది ఏదైనా ఉందంటే అది టమాటో. ఈ టమాటో లేనిదే ఏ కూర అయినా మనం వండుకోలేము. కచ్చితంగా అందరూ టొమాటోను వినియోగించాల్సిందే. టమాటోల రేట్ వందలు దాటినా కూడా కచ్చితంగా కొనుక్కొని కూరల్లో వినియోగించుకునే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అలాంటి టమాటోలతో నానా రకాల వంటకాలు చేసుకుంటారు. అందులో ఒకటే టమాటోలతో చేసుకునే పులుసు.
ఇది పూర్వకాలంలో చాలా మంది చేసుకునే తినేవారు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ఈ పులుసుతో ఒక్కో ముద్ద అన్నం తింటే అమృతం కూడా దేనికీ పనికిరాకుండా పోతుంది. అంత అద్భుతంగా ఉంటుంది. అందులోని మసాలా, ఆ పుల్లదనం అంతా ఆ రేంజ్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే పాతకాలంలో మాదిరిగా ఈ టమాటో పులుసు చేసుకోవడం చాలా మందికి తెలియదు. అందుకే ఈ స్టోరీలో టమాటో పులుసు ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది తెలుసుకుందాం.

టమాటో పులుసు తయారీకి కావలసిన పదార్థాలు:
పండిన టమాటోలు: 6-8 (చిన్న ముక్కలుగా తరిగినవి)
చింతపండు: చిన్న నిమ్మకాయ సైజు అంత (నానబెట్టి రసం తీయాలి)
ఉల్లిపాయ: 1 (సన్నగా తరిగినది)
పచ్చిమిర్చి: 2-3 (చీలికలు)
కరివేపాకు: 2 రెబ్బలు
ఆవాలు: 1 టీస్పూన్
జీలకర్ర: 1/2 టీస్పూన్
మెంతులు: 1/4 టీస్పూన్
పసుపు: 1/4 టీస్పూన్
కారం: 1 టీస్పూన్
ధనియాల పొడి: 1/2 టీస్పూన్
నూనె: 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి తగినంత
బెల్లం: చిన్న ముక్క (ఐచ్ఛికం)
కొత్తిమీర: కొద్దిగా (సన్నగా తరిగినది)
టమాటో పులుసు తయారీ విధానం:
చింతపండును నీటిలో నానబెట్టి, గుజ్జు తీసి పక్కన ఉంచండి.
ఒక మందపాటి గిన్నెలో నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి
వేయించండి.
ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయలు బంగారు రంగు
వచ్చేవరకు వేయించండి.
తరిగిన టమాటోలు, పసుపు, ఉప్పు వేసి టమాటోలు మెత్తబడే వరకు
ఉడికించాలి.
చింతపండు రసం, కారం, ధనియాల పొడి, బెల్లం వేసి బాగా కలపాలి.
పులుసును 5-10 నిమిషాలు లేదా చిక్కబడే వరకు ఉడికించాలి.
కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడి వేడిగా అన్నంతో వడ్డించండి.
చిట్కాలు:
టమాటోలు బాగా పండితే పులుసు రుచిగా ఉంటుంది.
చింతపండు రసం పులుపు ఎక్కువ ఉంటే నీళ్లు కలపవచ్చు.
బెల్లం వేయడం వలన పులుసు రుచి మరింత బాగుంటుంది.
పులుసును మరీ చిక్కగా కాకుండా కొంచెం పల్చగా ఉంచుకుంటే అన్నంలో
కలుపుకోవడానికి బాగుంటుంది.
అవసరాన్ని బట్టి కొద్దిగా ఇంగువని కూడా వాడవచ్చు.
ఆరోగ్య ప్రయోజనాలు:
టమాటోలలో విటమిన్ సి, లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా
ఉంటాయి.
ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, క్యాన్సర్ ప్రమాదాన్ని
తగ్గించడానికి సహాయపడతాయి.
టమాటోలలో ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
టమాటోలు గుండె ఆరోగ్యానికి కూడా మంచివి.
ఇందులోని విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి సహాయపడుతుంది.
టమాటోలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో
సహాయపడతాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications