Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
Vankaya gujju kura: వంకాయ గుజ్జు కూర..రైస్,చపాతీలోకి అద్భుతం..ఎలా చేయాలంటే..
సాధారణంగా చాలామంది వంకాయ అంటే దూరం పరిగెడుతుంటారు. అయితే సరైన విధంగా చేస్తే వంకాయ కూరని మించిన టేస్టీ కర్రీ మరొకటి ఉంటదు. వంకాయతో చాలా రకాల వెరైటీలను తయారుచేయవచ్చు. అందులో ఒకటి వంకాయ గుజ్జు కూర. రైస్ లోకి తిన్నా లేదా చపాతీలోకి తిన్నా అద్భుతంగా ఉండే కూర ఇది. వంకాయ గుజ్జు కూర చేయడం చాలా ఈజీ. వంకాయ గుజ్జు కూర తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధాం ఇక్కడ చూడండి.
వంకాయ గుజ్జు కూర తయారీకి కావాల్సిన
పదార్థాలు
-పావు కేజీ గుత్తి వంకాయలు
-టమాటో
-ఉల్లిపాయ
-పచ్చి మిర్చి
-ఎండు మిర్చి
-ఉప్పు
-ఇంగువ
-పసుపు
-వెల్లుల్లి
-మెంతులు
-ఆవాలు
-జీలకర్ర
-కారం
-కరివేపాకు
-కొత్తిమీర
-పచ్చి శెనగపప్పు
-చింతపండు రసం
వంకాయ గుజ్జు కూర తయరీ విధానం
-ముందుగా ఉసిరికాయ సైజ్ ఉండేంత చింతపండు ఓ గిన్నెలో వేసి నీళ్లు వేసి నానబెట్టండి.
-తర్వాత ఓ బౌల్ తీసుకొని అందులో కొన్ని నీళ్లు, ఉప్పు వేసి కలపండి.
-ఇప్పుడు పావుకేజీ లేత గుత్తి వంకాయలను సన్నని పొడవు ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్లల్లో వేయండి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఓ పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్,రెండు చిటికెళ్ల ఇాంగువ వేయండి
-ఇంగువ కొద్దిగా వేగిన తర్వాత అందులో కట్ చేసిన వంకాయ ముక్కలు,ఒక
మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు,1 టీస్పూన్ ఉప్పు,పావు టీ స్పూన్ పసుపు
వేసి కలుపుతూ 3-4 నిమిషాలు
మంటను మీడియం ప్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి.
-తర్వాత పెద్దగా కట్ చేసిన 2 టమాటో ముక్కలు వేసి కలిపి మూతపెట్టేసి మంటను సిమ్ లో పెట్టి బాగా మగ్గనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసి కలపండి.
-టమాటో ముక్కలు బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసి పాన్ ని కొద్దిసేపు పక్కనపెట్టండి. తర్వాత మూత తీసి చల్లారిన తర్వాత ఆ మొత్తాన్ని మిక్సీలో వేసి మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా డ్రైండ్ చేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద మరో పాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి అది కాగిన తర్వాత అందులో 2 చిటికెళ్ల మెంతులు వేసి బాగా ఎర్రగా వేయించండి. తర్వాత అందులో ఆవాలు,జీలక్ర,పచ్చి శనగపప్పు అన్నీ కొంచెం కొంచెం వేసి వేయించండి.
-ఆవాలు వేగిన తర్వాత అందులో కచ్చాపచ్చాగా దంచిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు, మూడు ఎండు మిరపకాయల ముక్కలను, కట్ చేసిన 3 పచ్చిమిర్చి,1 రెమ్మ కరివేపాకు వేసి వెల్లుల్లి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోండి.
-ఇప్పుడు మంట లో ప్లేమ్ లో పెట్టుకొని వేగిన పోపులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వంకాయ మిశ్రమాన్ని వేసి బాగా కలిపిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల కారం, ఒకటిన్నర టీస్పూన్ ధనియాల పొడి, పావు టీస్పూన్ జీలకర్ర పొడి వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోండి.
-తర్వాత ఇందులో నానబెట్టిన చింతపండు రసం కొంచెం,రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూతపెట్టండి.
-ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు మగ్గించిన తర్వాత అందులో సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే వేడి వేడి వంకాయ గుజ్జు కూర రెడీ. రైస్ లేదా చపాతీలో దేంట్లోకి తిన్నా కూడా ఇది అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












