Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
ఈ స్టైల్లో వెజిటేబుల్ బిర్యానీ చేస్తే.. చికెన్ బిర్యానీ కూడా బలాదూరే..!
వీకెండ్ లో నార్మల్ కూర కాకుండా ఈ సారి వెజిటేబుల్ బిర్యానీ చేసుకోవడానికి రెసిపీని మీ ముందుకు తీసుకొని వచ్చాము. ఇంట్లో వున్న వంట సామాగ్రితోనే చాలా సింపుల్‌గా టేస్టీగా ఈ వెజిటేబల్ బిర్యానీని రెడీ చేసుకోవచ్చు.

వెజిటేబుల్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్ధాలు
2 గ్లాసుల వరకు బాస్మీతీ రైస్
మంచి నూనె
ఒక కప్పు ఉల్లిపాయలు
జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, బగారా ఆకు, 2 యాలాకులు, 10
కాజూలు
కట్ చేసిన 5 పచ్చిమిరపకాయ ముక్కలు
1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు
1 కప్పు ఆలుగడ్డ ముక్కలు
1/2 కప్పు టమాట ముక్కలు
1/4 కప్పు బఠానాలు
ముప్పావు కప్పు పెరుగు
పావు టీస్పూన్ పసుపు
1 టీ స్పూన్ ధనియాల పొడి
1 టీ స్పూన్ కారంపొడి
1 టీస్పూన్ గరరం మసాలా
రైతా, నిమ్మకాయ

వెజిటేబుల్ బిర్యానీ తయారు చేసే విధానం
1. ఒక బౌల్లో 2 గ్లాసుల వరకు బాస్మీతీ రైస్‌ను
తీసుకని బాగా కడిగి నీళ్లు పోసి 30 నిమిశాలు నానబెట్టాలి.
2. కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని, 2 టేబుల్ స్పూన్ల
మంచి నూనెను పోసుకొని వేడి చేయాలి.
3. సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి.
4. అన్ని గరంమసాలాలను తగినంతగా తీసుకోవాలి. జీలకర్ర, లవంగాలు, దాల్చిన
చెక్క, బగారా ఆకు, 2 యాలాకులు, 10 కాజూలు తీసుకోవాలి.
5. కుక్కర్లో ఉల్లిపాయ ఫ్రై అయిన తరువాత బగారాను వేసుకొని
కలుపుకోవాలి.
6. కట్ చేసిన 5 పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి.
7. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని కలుపుకోవాలి.
8.1 కప్పు ఆలుగడ్డ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి.
9. 1/2 కప్పు టమాట ముక్కలను కూడా వేసుకోవాలి.
10. 1/4 కప్పు బఠానాలను కూడా వేసుకోవాలి.
11. హై ఫ్లేమ్‌లో మిక్స్ చేస్తూ కలపాలి.
12. కుక్కర్‌కు మూతపెట్టి 3 నిమిశాలు ఉడికించాలి.
13. గిన్నెలో ముప్పావు కప్పు పెరుగును తీసుకోవాలి.
14. గిన్నెలో పావు టీస్పూన్ పసుపును, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1 టీ
స్పూన్ కారంపొడి, రుచికి సరిపడ ఉప్పును తీసుకోవాలి.
15. 1 టీస్పూన్ గరరం మసాలా పొడిని వేసుకోవాలి.
16. కుక్కర్లో కలిపిపెట్టిన మసాలాను వేసుకోవాలి.
17. నానబెట్టిన రైస్‌ను కూడా కుక్కర్లో
వేసుకోవాలి.
18. కుక్కర్లో రెండున్నర గ్లాసుల నీళ్లను కూడా
పోసుకోవాలి.
19. టేస్టుకు సరిపడ ఉప్పు వుందా లేదా చెక్ చేసుకోవాలి.
20. కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు చూడాలి.
21. ఇక దీంతో వెజ్ బిర్యానీ రెడీ అయినట్టే.
22. రైతాతో ఈ వెజ్ బిర్యానీని సర్వ చేసుకుంటే చాలా బాగుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
