Latest Updates
-
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. !
రుచికరమైన గోధుమ పిండి అప్పం..ఈజీగా ఇలా చేసుకోండి
సాధారణంగా పెద్దలు పని ముగించుకొని సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు లేదా స్కూల్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఏదైనా రుచికరమైన చిరుతిండి తినాలని కోరుకుంటారు. పాత రోజుల్లో అయితే సాయంత్రం కాగానే మన అమ్మమ్మలు,నానమ్మలు ఇళ్లల్లో సాయంత్రం కాగానే తినడానికి ఏదో ఒక స్నాక్ పదార్థం రెడీ చేసి పెట్టేవాళ్లు. అయితే ప్రస్తుత బిజీ లైఫ్ లో చాలామంది ఇంట్లో చేసుకోవడం మానేసి ఆన్ లైన్ లోనే వాటిని ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు.
అయితే పెద్ద ప్రాసెస్ లేకుండా ఈజీగా ఉండే కొన్ని ఆహారాలను చేసుకొని సాయంత్రం పూట వాటిని ఆస్వాదించవచ్చు. అందులో ఒకటి గోధుమ అప్పం. దీనిని గోధుమ పిండి పొంగడాలు అని కూడా పిలుస్తుంటారు. త్వరగా తయారు చేయగల రుచికరమైన చిరుతిండి ఇది. జస్ట్ 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు బెల్లం ఉంటే చాలు కరకరలాడే, రుచికరమైనగోధుమ పిండి పొంగడాలు చేయవచ్చు.

తయారు చేయడానికి కావాల్సినవి
గోధుమ పిండి - 1 కప్పు
బెల్లం - 1/2 కప్పు
నీరు - 1/2 + 1/2 కప్పు
యాలకుల పొడి - 1/4 టీస్పూన్
బేకింగ్ సోడా - 2 చిటికెల్లు
నూనె - వేయించడానికి అవసరమైనంత
తయారీ విధానం
-::ఫస్ట్ ఒక గిన్నెలో గోధుమ పిండిని తీసుకోవాలి.
-తర్వాత ఒక పాత్రలో 1/2 కప్పు బెల్లం తీసుకుని 1/2 కప్పు నీళ్లు పోసి
ఓవెన్లో పెట్టి బెల్లం కరగనివ్వాలి.
-బెల్లం కరిగిన తర్వాత బెల్లం వడపోసి గోరువెచ్చగా ఉండగానే
గోధుమపిండిలో వేసి బాగా కలపాలి.
-తర్వాత మళ్లీ 1/2 కప్పు నీళ్లు పోసి ముద్దలు లేకుండా ఇడ్లీ పిండి
మాదిరి చేసుకోవాలి.
-తర్వాత అందులో యాలకులపొడి,వంటసోడా వేసి ఉండలుగా రాకుండా బాగా
కలపాలి.
-తర్వాత మూతపెట్టి 10 నిమిషాలు నాననివ్వాలి.
-చివరగా ఓవెన్లో వాక్ పెట్టి వేయించడానికి
కావల్సినంత నూనె వేసి అది వేడయ్యాక ఒక్కో చెంచా పిండిని నూనెలో పోసి
గోల్డ్ కలర్ రంగు వచ్చేవరకు ఉడికించుకుంటే రుచికరమైన గోధుమల అప్పం
లేదా గోధుమ పిండి పొంగడాలు రెడీ.
ఈ గోధుమ పిండి పొంగడాలు చిన్నపిల్లల ఆకలిని తక్కువ సమయంలోనే తీరుస్తుంది. పిల్లలు దీన్ని ఇష్టపడతారు. ప్రస్తుతం కొన్ని చోట్ల వర్షాలు కురుస్తుండటంతో సాయంత్రం పూట ఏదైనా తినాలని కుటుంబ సభ్యులు అడిగితే దీనిని తయారు చేసి వేడి వేడిగా వడ్డించవచ్చు.
గమనిక: ఈ కథనంలో మేము పొందు పరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణులు సలహాలు తీసుకోవాలి. దీనికి బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి సంబంధం లేదు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
