Latest Updates
-
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు!
పుట్టగొడుగుల కూరను.. ఈ స్టైల్లో చేసుకుంటే.. రోజూ తినాలనిపిస్తుంది..!
పుట్టగొడుగులను ఎప్పుడైనా తిన్నారా. అంటే ఈ కూరను ఇప్పటి వరకు తినని వాళ్లు చాలా మంది వున్నారు. బటయ కర్రీ పాయింట్లలో కూడా ఈ కూర సులభంగా అందుబాటులో వుండదు. పుట్టగొడుగులను రుచిగా ఎలా తయారు చేసుకోవాలో మీకు అందించబోతున్నాం. చాలా సింపుల్‌గా, ఇంట్లో వున్న వంట సామాగ్రితోనే మష్రూం కర్రీని రెడీ చేసుకోవచ్చు.

మష్రూమ్ కరీ కోసం కావాల్సిన వంట పదార్ధాలు
200 గ్రాముల మష్రూంలు
ఉప్పు
మంచి నూనె
1 బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 5 యాలాకులు, అర టీ స్పూన్ జిలుకర
ఉల్లిపాయ
యాలాకులు
జిలుకర
2 టమాటాలు
1 అల్లం ముక్క
12 వెల్లుల్లి ముక్కలు
10 జీడిపప్పు
2 పచ్చిమిరపకాయలు
పావు టీ స్పూన్ పసుపు
2 టీ స్పూన్ల కారంపొడి
1 టీ స్పూన్ ధనియాల పొడి
కసూరి మేతి
అర టీస్పూన్ గరం మసాలా
కొత్తిమీర ఆకులు

మష్రూమ్ కర్రీ తయారు చేసే విధానం
1. ముందుగా 200 గ్రామల వరకు మష్రూంలను కడిగి తీసుకోవాలి. మష్రూంపైన వుండే పొరలను, చెత్తను తీసేసుకోవాలి.
2. రెండు మూక్కలుగా మష్రూంలను కట్ చేసుకోవాలి.
3. అర టీస్పూన్ ఉప్ప వేసుకొని నీళ్లు పోసుకొని బాగా కడగాలి.
4. ఒక ప్యాన్‌లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ను తీసుకోవాలి. ప్యాన్‌లో మష్రూంను తీసుకొని 4 నిమిశాలు ఫ్రై చేసుకోవాలి.
5. మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా, వాటిని మరో గిన్నెలోకి తీసుకోవాలి.
6. మళ్లీ ప్యాన్‌లో 2 టేబల్ స్పూన్ల మంచి నూనెను యాడ్ చేసుకోవలి. ఇందులో 1 బిర్యానీ ఆకును, చిన్న దాల్చిన చెక్క,
7. 5 యాలాకులు, అర టీ స్పూన్ జిలుకరను వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
8. ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయను వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
9. మిక్సీ గ్రైండర్‌లో 2 కట్ చేసిన టమాటాలను తీసుకోవాలి. 1 అల్లంముక్కను, 12 వెల్లుల్లి ముక్కలను, 10 జీడిపప్పు పలుకులను మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
10. ప్యాన్‌లో ఫ్రై అవుతున్న పోప్‌లో గ్రైండ్ చేసిన టమాట పేస్టును వేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
11. పావు టీ స్పూన్ పసుపును, 2 టీ స్పూన్ల కారంపొడిని, 1 టీస్పూన్ ధనియాల పొడిని , రుచికి సరిపడ ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి.
12. ఫ్రై చేసిన మష్రూంలను ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ప్యాన్‌పై మూతను పెట్టి 3 నిమిశాల వరకు బాగా ఉడికించాలి.
13. గ్రేవీకి సరిపడ నీళ్లను పోసుకోవాలి. ప్యాన్‌పై మూతను పెట్టి 5 నిమిశాల వరకు ఉడికించాలి.
14. కూరలో అర టీస్పూన్ కసూరి మేతిని, అర టీస్పూన్ గరం మసాలాను వేసుకొని బాగా కలుపుకోవాలి. కూరలో కొన్ని కొత్తిమీర ఆకులను వేసుకొని బాగా కలుపుకోవాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications