Latest Updates
-
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే!
Banana Bread: నోరూరిచే బనానా బ్రెడ్ తయారీ
బనానా బ్రెడ్.. అరటిపండుతో చేసే ఈ బ్రెడ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. మృదువుగా, తియ్యగా మధురమైన టేస్ట్‌తో బనానా బ్రెడ్ ఉంటుంది. బనానా బ్రెడ్ అనగానే అదో పెద్ద ప్రాసెస్ అనుకోవద్దు. ఇంట్లో కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. షాపుల
Banana Bread: బనానా బ్రెడ్.. అరటిపండుతో చేసే ఈ బ్రెడ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. మృదువుగా, తియ్యగా మధురమైన టేస్ట్‌తో బనానా బ్రెడ్ ఉంటుంది. బనానా బ్రెడ్ అనగానే అదో పెద్ద ప్రాసెస్ అనుకోవద్దు. ఇంట్లో కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. షాపుల్లో దొరికేలా మృదువుగా, తియ్యగా, మంచి రుచితో తయారు చేసుకోవచ్చు.

బనానా బ్రెడ్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
బనానా బ్రెడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
1. అరటి పండ్లు - 2.5 కప్పులు
2. బట్టర్ - 0.5 కప్పులు
3. బ్రౌన్ షుగర్ - ముప్పావు కప్పు
4. గుడ్లు - 2
5. పాలు - ముప్పావు కప్పు
6. వనిల్లా ఎక్స్ట్రాక్ట్ - 1 కప్పు
7. ఆల్ పర్పస్ ఫ్లోర్ - 2 కప్పులు
8. బేకింగ్ సోడా - 1 టీస్పూన్
9. ఉప్పు - సరిపడ

బనానా బ్రెడ్ ఎలా తయారు చేయాలంటే..
1. ఓవెన్‌ను ముందుగా 175°C వరకు వేడి చేయాలి. తర్వాత లోఫ్ ప్యాన్‌లో బట్టర్ వేసుకోవాలి.
2. మిక్సింగ్ గిన్నెలో బాగా పండిన అరటి పండ్లను తీసుకుని ఫోర్క్‌తో పూర్తిగా మెత్తగా చేసుకోవాలి. తర్వాత అందులో బట్టర్ వేసుకోవాలి. బేకింగ్ సోడా, ఉప్పు, చక్కెర, గుడ్డ, వనిలా ఎక్స్‌స్ట్రాక్ట్ , ఫ్లోర్ అన్ని వేసుకుని చక్కగా కలుపుకోవాలి.
3. మిశ్రమాన్ని లోఫ్ ప్యాన్‌లో వేసుకోవాలి.
4. 175°C వద్ద వేడిగా ఉన్న ఓవెన్‌లో లోఫ్ పాన్ పెట్టుకోవాలి. ఓ గంట సేపటి వరకు కాల్చనివ్వాలి. లోపలి తడి పోయి, మంచి రంగు వచ్చే వరకు ఉంచాలి. బ్రెడ్ మంచి రంగులోకి వచ్చే వరకూ ఓవెన్‌లోనే ఉంచాలి.
5. ఓవెన్ నుండి తీసిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత బ్రెడ్ చక్కని స్లైస్‌లుగా కట్ చేసుకోవడానికి బ్రెడ్ నైఫ్ వాడొచ్చు.
6. ఈ బనానా బ్రెడ్ 4 రోజుల వరకు ఉంటుంది. ఎక్కువ రోజులు కావాలంటే చక్కగా ప్యాక్ చేసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.



Click it and Unblock the Notifications











