Latest Updates
-
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి
Uppudu Pindi: నోరూరించే ఉప్పుడు పిండి ఎలా తయారు చేస్తారో తెలుసా?
Uppudu Pindi: ఉప్పుడు పిండి, చాలా మందికి నోరూరించే పక్కా విలేజ్ వంటకం. బియ్యపు పిండితో చేసే ఈ వంటకం అంటే చాలా మంది చెవులు కోసుకుంటారు. ఉప్పుడి పిండిలో కొద్దిగా పల్లీ నూనె వేసుకుని, పక్కన తొక్కు వేసుకుని (ఆవకాయ) అద్దుకుని(అంటించుకుని) తింటే ఆహా. దాని ముందు ఏ వంటకం కూడా పని చేయదు. అందుకే ఉప్పుడు పిండి అంటే చాలా మందికి ఎంతో ఇష్టం.

ఉప్పుడు పిండి ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా తయారు చేస్తారు. ఎలా తయారు చేసినా అందులో ఎలాంటి పదార్థాలు వేసినా దాని మెయిన్ ఇన్ గ్రీడియంట్ మాత్రం బియ్యపు పిండి. ఆ బియ్యపు పిండి కూడా మరీ మెత్తగా కాకుండా.. మరీ రవ్వలా కాకుండా ఉండాలి.

అసలు విలేజ్ స్టైల్ ఉప్పుడు పిండిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఉప్పుడు పిండి తయారీకి కావాల్సిన పదార్థాలు:
బియ్యం పిండి - 1 గ్లాసు
పెసరపప్పు - 2 టేబుల్ స్పూన్లు
మినప్పప్పు - ఒకటిన్నర టేబుల్ స్పూన్
ఆవాలు - ఒకటిన్నర టేబుల్ స్పూన్
జీలకర్రు - ఒకటిన్నర టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - ఐదు
కరివేపాకు - గుప్పెడు
ఉల్లిపాయలు - తగినన్ని
ఉప్పు - తగినంత
నూనె - తాలింపు కోసం
ఎండు మిర్చి - 2 లేదా 3
కొబ్బరి - ఉంటే పావు, లేకపోయినా పర్లేదు

ఉప్పుడు పిండి ఎలా తయారు చేయాలంటే..
* అడుగు కొద్దిగా మందం ఉన్న గిన్నె తీసుకోవాలి. దానిని స్టవ్ పై పెట్టి నూనె పోసుకోవాలి.
* తాలింపు కోసం మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి.
* మంచి రుచి కోసం కొబ్బరి పొడి వేసుకోవచ్చు. అన్నీ వేగాయనుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు మరిగే వరకు ఉంచాలి.
* తర్వాత నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు వేయాలి. తర్వాత కొద్దిగా నూనె పోసుకోవాలి.
* తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత బియ్యపు పిండి వేసుకోవాలి.
* బియ్యపు పిండి వేస్తున్నంత సేపు కలుపుతూనే ఉండాలి. లేదంటే ఉండలు కడుతుంది. స్టవ్ సీమ్ లో ఉంచాలి.
* మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టాలి.
* గిన్నెలోని పిండి అంతా చక్కగా ఉడికే దాకా మూత పెట్టుకుని ఉంచాలి.
* తర్వాత గిన్నె దించేసుకుని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. మరీ వేడివేడి మీద తింటే ఉప్పుడు పిండి అంతగా రుచిగా ఉండదు.
* కొద్దిగా చల్లారిన తర్వాత తింటే అద్భుతంగా ఉంటుంది. అందులో పల్లీ నూనె కూడా వేసుకుని తినొచ్చు. ఉప్పుడు పిండి మాధుర్యం తెలియాలంటే పక్కన ఆవకాయ ఉండి తీరాలి. కొద్దికొద్దిగా అంటించుకుంటూ ఉప్పుడు పిండి తింటుంటే భలే మజాగా ఉంటుంది.



Click it and Unblock the Notifications











