Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
Sarvapindi Recipe: నోరూరించే తెలంగాణ సంప్రదాయ వంటకం సర్వపిండి
సర్వపిండిని, గిన్నెప్ప, గిన్నెపిండి, గంజుపిండి, తపాలా చెక్క ఇలా చాలా రకాలుగా పిలుస్తుంటారు. చాలా ఇష్టంగా తినే చిరుతిండిగా సర్వపిండికి పేరుంది. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనది ఈ వంటకం. సర్వపిండిని సామాన్యుడి పిజ్జా అని క
Sarvapindi Recipe: సర్వపిండి. ఇది తెలంగాణ ప్రత్యేక వంటకం. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సర్వపిండిని ఎక్కువగా తింటుంటారు. సర్వపిండి అనగానే లొట్టలేసుకునే వారు చాలా మంది ఉంటారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లాల్లో సర్వపిండి ఎక్కువగా తింటారు.

సర్వపిండిని, గిన్నెప్ప, గిన్నెపిండి, గంజుపిండి, తపాలా చెక్క ఇలా చాలా రకాలుగా పిలుస్తుంటారు. చాలా ఇష్టంగా తినే చిరుతిండిగా సర్వపిండికి పేరుంది. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనది ఈ వంటకం. సర్వపిండిని సామాన్యుడి పిజ్జా అని కూడా పిలుస్తారు.

సర్వపిండికి ప్రధానంగా బియ్యపు పిండి కావాలి. అందులో ఉల్లిపాయలు, కరివేపాకు, పల్లీలు, నువ్వులు, కొత్తమీరర విత్తనాలు, ఉప్పు, కారం ప్రధాన పదార్థాలు. కాలానుగుణంగా సర్వపిండి చేసే పద్ధతి మారుతూ వస్తోంది. ఒక్కొక్కరు ఒక్కోలా సర్వపిండి తయారు చేస్తారు. కొందరు గారెలు చేసినట్లుగా నూనెలో వేయిస్తారు. మరికొందరు గిన్నెకు లోపలి వైపు నూనె రాసి దానిపై పిండి రాసి సన్నని మంటపై కాలుస్తారు. దీనిని మరోవైపు కాల్చాల్సిన అవసరం లేదు.

సర్వపిండికి కావాల్సిన పదార్థాలు:
* బియ్యపు పిండి - 2 కప్పులు
* పచ్చి మిర్చి - రెండు
* ఉల్లి పాయలు - కావాల్సినన్ని
* వెల్లుల్లి పాయలు - రెండు
* జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్
* కారం - కొద్దిగా
* పల్లీలు - గుప్పెడు
* నువ్వులు - సగం గుప్పెడు
* శెనగపప్పు - సగం గుప్పెడు
* కొత్తిమీర - కావాల్సినన్ని
* కరివేపాకు - కొన్ని రెబ్బలు
* ఉల్లి ఆకు తరుగు - కాస్తంత
* ఉప్పు - తగినంత
* నూనె - కావాల్సినంత
* నీళ్లు - పిండి కలుపుకునేందుకు

సర్వపిండి తయారు చేసే విధానం:
* రెండు గంటల పాటు శెనగపప్పు నానబెట్టుకోవాలి. పిండి కలుపుకునేందుకు ముందుగానే పల్లీలు వేయించుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకోవచ్చు. లేదా అలాగే వేసుకోవచ్చు.
* ఒక గిన్నె తీసుకుని అందులో బియ్యపు పిండి వేసుకోవాలి. నానబెట్టిన శెనగపప్పు, పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, నువ్వులు, కొత్తిమీరు, కరివేపాకు, ఉల్లి ఆకు, కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా నూనె పోసి కావాల్సినన్ని నీళ్లు పోసుకుని కొద్ది కొద్దిగా కలుపుకోవాలి. పిండి మెత్తగా అయ్యే వరకు కలుపుకోవాలి.
* అడుగు కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. అందులో కొద్దిగా నూనె పోసుకుని గిన్నె అంతా పట్టుకునేలా చేతితో రాసుకోవాలి.
* ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకుని నూనె రాసిన గిన్నెలో ఆ పిండిని ఒత్తుకోవాలి. అడుగు భాగాన కొద్దిగా మందంగా, అంచుల వద్ద పలుచగా ఒత్తుకోవాలి. అక్కడక్కడ చిన్న చిన్న రంధ్రాలు చేసుకుని అందులో నూనె పోయాలి.
* పిండి ఒత్తుకున్న గిన్నెను స్టవ్ పై పెట్టి అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల లోపలి సర్వపిండి చక్కగా ఉడుకుతుంది.
* సర్వపిండి చక్కగా కాలిందని నిర్ధారించుకున్న తర్వాత దానిని పక్కన పెట్టుకోవాలి. గిన్నె చల్లారిన తర్వాత దానిని బోర్లా వేసుకుంటే లోపల ఉన్న సర్వపిండి కింద పడుతుంది. ఆ తర్వాత సర్వపిండి సర్వ్ చేసుకుంటే సరి.
* కొందరు గిన్నెకు పిండి ఒత్తుకుని నూనె ఎక్కువగా వేస్తుంటారు. ఆ సర్వపిండి మొత్తం నూనెలో గారెలుగా కాలుతుంది. ఈ పద్ధతిలో కూడా కొంత మంది సర్వపిండి చేసుకుంటారు.



Click it and Unblock the Notifications











