Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
బరువు తగ్గాలనుకుంటున్నారా? బియ్యం లేకుండా ఇలా హెల్దీ ఇడ్లీ చేసుకోండి..షుగర్ పేషెంట్లకు మంచిది!
ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇడ్లీ, దోశలు తిని బోర్ కొట్టిందా? అయితే ఓసారి పెసరపప్పు ఇడ్లీ ట్రై చేయాల్సిందే. సాధారణంగా మనం బియ్యం, మినపప్పుతో ఇడ్లీలు చేసుకుంటాం.
అయితే బియ్యం లేకుండా కేవలం పెసరపప్పుతో చేసే ఈ ఇడ్లీలు రుచిలోనూ, ఆరోగ్య ప్రయోజనాల్లోనూ సాంప్రదాయ ఇడ్లీల కంటే చాలా ప్రత్యేకమైనవి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్ పేషెంట్లకు ఇది ఒక చక్కటి ఆహారం. మరి అంతటి రుచికరమైన, పోషకాల గని అయిన ఈ పెసరపప్పు ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
పెసరపప్పు- 1 కప్పు
పెరుగు - అర కప్పు
తురిమిన క్యారెట్ - పావు కప్పు
పచ్చిమిర్చి - 2
అల్లం తురుము - 1 టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా
వంట సోడా - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె- 1 స్పూన్
ఆవాలు-కొద్దిగా
జీలకర్ర- కొద్దిగా
ఇంగువ-చిటికెడు
కరివేపాకు-కొంచెం
పసుపు- కొంచెం
తయారీ విధానం
-ముందుగా ఒక కప్పు పెసరపప్పును శుభ్రంగా కడిగి సుమారు 2 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. పెసరపప్పు త్వరగా నానుతుంది కాబట్టి ఎక్కువ సమయం అవసరం లేదు.
-నానిన పెసరపప్పులో నీటిని వడకట్టి గ్రైండర్ లేదా మిక్సీ జార్ లో వేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీరు చేర్చి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి. పిండి మరీ జారుగా కాకుండా, ఇడ్లీ పిండిలా గట్టిగా ఉండేలా చూసుకోవాలి.
-రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో పెరుగు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం తురుము, తురిమిన క్యారెట్, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఇడ్లీలు మృదువుగా రావడానికి చిటికెడు వంట సోడా కలపవచ్చు.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న పాన్ పెట్టుకుని నూనె వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, చిటికెడు పసుపు వేసి వేయించాలి. ఈ పోపును ఇడ్లీ పిండిలో వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి. పోపు వల్ల ఇడ్లీకి అద్భుతమైన రుచి వస్తుంది.
-ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె రాసి, సిద్ధం చేసుకున్న పిండిని ప్లేట్లలో వేయాలి. ఇడ్లీ కుక్కర్ లేదా స్టీమర్ లో నీరు పోసి, ఈ ప్లేట్లను ఉంచి 10 నుండి 12 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి.
-10 నిమిషాల తర్వాత ఒక టూత్ పిక్ లేదా చాకుతో ఇడ్లీ మధ్యలో గుచ్చి చూడండి. పిండి అంటుకోకుండా శుభ్రంగా బయటకు వస్తే ఇడ్లీలు ఉడికినట్టే.
-స్టవ్ ఆఫ్ చేసి, వేడివేడి పెసరపప్పు ఇడ్లీలను ప్లేట్ లోకి తీసుకోండి. దీనిని అల్లం పచ్చడి, కొబ్బరి చట్నీ లేదా సాంబార్ తో తింటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications








