Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఎప్పుడైనా పెరుగు పరాఠా తిన్నారా? ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు!
ఉల్లిపాయ పరాఠా, ఆలూ పరాఠా, క్యాబేజీ, ముల్లంగి, మెంతి, లచ్చా పరాఠా..ఇలా ఎన్నో రకాల పరాఠాలను మనం తరచుగా ఇంట్లో చేసుకుని తింటుంటాం. కానీ మీరు ఎప్పుడైనా దహి పరాఠా(పెరుగు పరాఠా) రుచి చూశారా? ఇది తయారు చేయడం చాలా సులభం మాత్రమే కాదు నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేంత మృదువుగా, భలే రుచిగా ఉంటుంది.
ప్రముఖ మాస్టర్ చెఫ్ పంకజ్ భదౌరియా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో దహి పరాఠా రెసిపీని పంచుకున్నారు. నోరూరించే దహి పరాఠా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
పెరుగు - అర కప్పు
పాలు - అర కప్పు
గోధుమ పిండి - 2 కప్పులు
ఉప్పు - అర టీస్పూన్
షుగర్ పౌడర్- 2 టీస్పూన్లు
వంట నూనె - 1 టేబుల్ స్పూన్
కార్న్‌ఫ్లోర్ - అర కప్పు
నూనె - పావు కప్పు
స్ప్రింగ్ ఆనియన్స్ (ఉల్లికాడలు) - కొద్దిగా
చిల్లీ ఫ్లేక్స్ - కొద్దిగా
తయారు చేసే విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో పెరుగు, పాలు, ఉప్పు, పొడి చక్కెర వేసి బాగా కలపాలి. ఆ తర్వాత అందులో గోధుమ పిండిని వేసి మెత్తటి ముద్దలా కలుపుకోవాలి. పిండి సులభంగా కలుపుకోవడానికి అవసరమైతే మరికొన్ని పాలు జతచేయవచ్చు.
-పిండి ముద్దలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె పిండికి బాగా పట్టేలా మెత్తగా పిసకాలి. ఇప్పుడు ఈ పిండిపై ఒక శుభ్రమైన తడి గుడ్డను కప్పి సుమారు 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
-పిండి నానే లోపు, ఒక చిన్న గిన్నెలో కార్న్‌ఫ్లోర్, పావు కప్పు నూనె వేసి ఎక్కడా ఉండలు లేకుండా మృదువైన పేస్ట్ లా కలిపి పెట్టుకోవాలి.
-30 నిమిషాల తర్వాత పిండిని మళ్లీ ఓ రెండు నిమిషాల పాటు పిసికి, 5 సమాన భాగాలుగా (ఉండలుగా) చేసుకోవాలి.
-ఒక్కో ఉండను తీసుకుని చపాతీ కర్రతో పెద్ద రోటీలా వత్తుకోవాలి.
-వత్తుకున్న రోటీపై ముందుగా తయారుచేసి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్-నూనె పేస్ట్ ను అంతటా సమానంగా రాయాలి. ఇప్పుడు చాకు తీసుకుని రోటీ మధ్యలో నుండి చివర వరకు ఒక కట్ చేయాలి.
-దీనిపై కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, సన్నగా తరిగిన పచ్చి ఉల్లికాడలను చల్లాలి. ఆ తర్వాత కట్ చేసిన భాగం నుండి కోన్ ఆకారంలో చుట్టుకుంటూ వచ్చి, ఒక్కో పొరను మడిచి మళ్లీ గుండ్రటి బంతిలా చేసుకోవాలి. ఈ ఉండలను మరో 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి.
-10 నిమిషాల తర్వాత, ఉండలను మరీ పల్చగా కాకుండా కాస్త మందంగా పరాఠాల్లా వత్తుకోవాలి.
-స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, మీడియం మంట మీద పరాఠాలను వేయాలి. కావలసినంత నెయ్యి లేదా నూనె రాస్తూ పరాఠాలు మంచి రంగులోకి మారి, క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన, పొరలు పొరలుగా ఉండే వేడివేడి దహి పరాఠా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications