Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బనానా లస్సీ.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది!
ఎండాకాలం వచ్చేసింది. సూర్యుడి భగభగలకు శరీరమంతా నీరసించిపోతుంది. గొంతు ఎండిపోతూ చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. వేసవి అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది చల్లని పానీయాలు. అందులో పంజాబీలకు ఎంతో ఇష్టమైన లస్సీకి మన దగ్గర కూడా ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఎండాకాలంలో లస్సీకి ఉండే గిరాకీ అంతా ఇంతా కాదు. ఇది శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, కడుపును చల్లబరచడమే కాకుండా తక్షణ శక్తిని కూడా అందిస్తుంది.

సాధారణంగా మార్కెట్లో రోజ్, మామిడి, పేడా, సాదా లస్సీలు అధికంగా అమ్ముడవుతుంటాయి. వాటి రుచి అద్భుతంగానే ఉంటుంది. కానీ, మీరు ఎప్పుడైనా బనానా లస్సీని రుచి చూశారా? ఈ లస్సీని త్వరగా తయారు చేయడమే కాకుండా, దీని రుచి కూడా చాలా చిక్కగా, మృదువుగా, క్రీమీగా ఉంటుంది.
బనానా లస్సీ తయారీకి కావలసిన పదార్థాలు
బాగా పండిన అరటిపండ్లు: 2
తాజా పెరుగు: 1 కప్పు
కాచి చల్లార్చిన పాలు లేదా చల్లటి నీళ్లు: అర కప్పు
పంచదార లేదా తేనె: 2 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి: పావు టీస్పూన్
ఐస్ క్యూబ్స్: 4 లేదా 5
బాదం, పిస్తా: 2 టేబుల్ స్పూన్లు
బనానా లస్సీ తయారీ విధానం
-ముందుగా బాగా పండిన అరటిపండ్లను తీసుకుని తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లేదా బ్లెండర్ తీసుకుని, అందులో కట్ చేసిన అరటిపండు ముక్కలు, చిక్కటి తాజా పెరుగు వేయాలి. తీపి కోసం మీ అభిరుచికి తగినట్లుగా పంచదార లేదా తేనెను కలుపుకోవాలి. పంచదారకు బదులు నానబెట్టిన ఖర్జూరం వేసుకున్నా రుచి అమోఘంగా ఉంటుంది.
-లస్సీకి అసలైన రుచి, సువాసన ఇచ్చేది యాలకులు. కాబట్టి ఈ మిశ్రమంలో పావు టీస్పూన్ యాలకుల పొడిని వేయాలి. ఇది అరటిపండు రుచిని మరింతగా ఎలివేట్ చేస్తుంది.
-ఇప్పుడు మిక్సీని ఆన్ చేసి, అరటిపండు ముక్కలు, పెరుగు పూర్తిగా కలిసిపోయి మెత్తటి క్రీమ్ లా మారే వరకు బ్లెండ్ చేయాలి. అరటిపండు వల్ల లస్సీ కాస్త చిక్కగా మారుతుంది. కాబట్టి ఆ చిక్కదనాన్ని సరిచేయడానికి, అందులో అర కప్పు చల్లని పాలు లేదా నీళ్లు పోయాలి. అలాగే మరింత కూలింగ్ కోసం 4-5 ఐస్ క్యూబ్స్ వేసి, మళ్లీ ఒక 10-15 సెకన్ల పాటు మిక్సీ పట్టాలి.
-అంతే ఎంతో మృదువైన అరటిపండు లస్సీ రెడీ.
-తయారైన ఈ చల్లటి లస్సీని గాజు గ్లాసుల్లోకి పోయాలి. పైన సన్నగా తరిగిన బాదం, పిస్తా ముక్కలతో గార్నిష్ చేయాలి. లస్సీ తాగుతున్నప్పుడు మధ్యమధ్యలో ఈ డ్రై ఫ్రూట్స్ పంటికి తగులుతూ రుచిని రెట్టింపు చేస్తాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
