Latest Updates
-
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి!
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్!
దోశల్లో వందల వెరైటీలు ఉంటాయి. సాధారణం మనం ఎక్కువగా మసాలా దోశ, రవ్వ దోశ, సెట్ దోశ,ప్లెయిన్ దోశ లేదా ఎగ్ దోశ, పనీర్ దోశ వంటివే ఎక్కువగా ఇళ్లల్లో చేసుకొని తింటుంటాం. అయితే ఎప్పుడూ అవే దోశలు కాకుండా కాస్త కొత్తగా, అది కూడా హెల్తీగా అనిపించేలా చేయాలనుకుంటే మాత్రం కీరదోస దోశ ట్రై చేయాల్సిందే.
కీర దోసకాయ దోశ పేరు వినగానే కాస్త కొత్తగా అనిపించినా, దీని రుచి మాత్రం అమోఘం. శరీరానికి చలవ చేసే దోసకాయతో పాటు, బియ్యప్పిండి, కమ్మని కొబ్బరి, కారం కోసం పచ్చిమిర్చి వేసి చేసే ఈ దోసెలు..సాయంత్రం వేళ పిల్లలు స్కూల్ నుండి రాగానే వేడివేడిగా చిరుతిండిలా చేసి పెట్టడానికి కూడా ఇది అద్భుతమైన ఛాయిస్.

కీరదోసకాయ దోశ తయారీకి కావలసిన పదార్థాలు
కీరదోసకాయ - 1
బియ్యం పిండి - 1 కప్పు
బొంబాయి రవ్వ (సూజీ) - 2 టేబుల్ స్పూన్లు
పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
పచ్చి మిరపకాయలు - 2
జీలకర్ర - అర టీస్పూన్
ఉప్పు - మీ రుచికి సరిపడా
నీరు - పిండి కలుపుకోవడానికి అవసరమైనంత
నూనె లేదా నెయ్యి - దోసెలు కాల్చుకోవడానికి
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
కీరదోసకాయ దోశ తయారీ విధానం
-ముందుగా ఒక ఫ్రెష్ కీర దోసకాయను తీసుకుని శుభ్రంగా కడిగి, పైన ఉన్న తొక్కను తీసేయండి. ఇప్పుడు దానిని సన్నగా తురుముకోవాలి. కీరదోసకాయ తురుములోని నీటిని అస్సలు పిండేయకూడదు. ఆ నీటితోనే దోసెకు అసలైన రుచి వస్తుంది.
-ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని.. అందులో ముందుగా సిద్ధం చేసుకున్న దోసకాయ తురుము, పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తని పేస్ట్ లా మిక్సీ పట్టుకోవాలి.
-ఒక పెద్ద గిన్నె తీసుకుని..అందులో బియ్యపు పిండి, బొంబాయి రవ్వ వేయండి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న దోసకాయ, కొబ్బరి మిశ్రమాన్ని వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి.
-దోసె పిండి మరీ చిక్కగా కాకుండా, కాస్త పలుచగా ఉండేలా చూసుకుంటూ అవసరమైనన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. రెగ్యులర్ రవ్వ దోసె పిండిలా పలుచగా ఉంటే బాగుంటుంది.
-ఈ పిండిపై మూత పెట్టి కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు పక్కన ఉంచండి. ఇలా చేయడం వల్ల రవ్వ నాని, దోసెలు చక్కగా వస్తాయి.
-15 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించి, దోసెల పెనం పెట్టి వేడి చేయండి. పెనం వేడెక్కాక, కొద్దిగా నూనె రాయండి.పిండిని గరిటెతో తీసుకుని, పెనం మధ్యలో పోసి బయట వైపుకు నెమ్మదిగా గుండ్రంగా పలుచగా పరచండి.
-దోశ అంచుల చుట్టూ కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి, మంటను మీడియంలో ఉంచి అడుగుభాగం మంచి బంగారు గోధుమ రంగులోకి మారే వరకు కాల్చండి.
తర్వాత దోసెను మెల్లగా రెండో వైపుకు తిప్పి, అటువైపు కూడా ఎర్రగా కాల్చుకోవాలి.
-అంతే గుమగుమలాడే వేడివేడి కీరదోసకాయ దోశలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
