Latest Updates
-
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్‌ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.!
చపాతీ పిండి ముద్ద మిగిలితే ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. వాడే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
చాలా మంది డిన్నర్‌కి చపాతీలు లేదా రోటీలు తింటుంటారు. అయితే ముఖ్యంగా చపాతీలు చేసేటప్పుడు ఒక్కోసారి పిండి మిగులుతుంటుంది. ఈ పిండి ముద్దను చేసే టైం లేక, పడేయలేక ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు. దీనిని మరుసటి రోజు వాడుతుంటారు. అయితే ఇలా లెఫ్ట్ ఓవర్ పిండి ముద్దను వాడటం మంచిదేనా.. పోషకాహార నిపుణుల సలహాలు చూద్దాం…

మిగిలిపోయిన చపాతీ పిండిముద్దను తిరిగి ఉపయోగించేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ పిండిని ఎలా నిల్వ చేశారు.. ఎంత సమయంలో ఫ్రిజ్‌లో ఉంది. దీనిని వాడేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. తెలుసుకుందాం..
దాబా స్టైల్ వెజ్ కీమా కర్రీ.. గ్రేవీలో ఈ రెండూ కలిపారంటే టేస్ట్ అదిరిపోవాల్సిందే.!
బ్యాక్టీరియా ప్రమాదం
గోధుమ పిండిని నీటితో ముద్దగా కలిపిన తర్వాత పొడి పిండితో పోలిస్తే కలిపిన పిండిలో నీటి శాతం పెరుగుతుంది. అందుకే దీనిని నిల్వ చేసేపటప్పుడు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. అయితే పిండిని ఎక్కువసేపు గది ఉష్ణోగ్రతలో ఉంచినట్లయితే అందులో బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక వేడి వాతావరణంలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఆరోగ్య సమస్యలు
చపాతీ పిండి ముద్దను సరిగ్గా నిల్వ చేయకపోతే అందులో హానికరమైన సూక్ష్మజీవులు అధికంగా పెరుగుతాయి. దీంతో ఈ పిండి ముద్దతో చపాతీలు చేసి తినడం ద్వారా కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, వికారం వంటి ఫుడ్ ఇన్‌ఫెక్షన్ సమస్యలు తలెత్తవచ్చు.
ఎలా నిల్వ చేయాలి
పిండి ముద్దను ఎక్కువ సేపు గది ఉష్ణోగ్రతలో ఉంచకుండా వీలైనంత త్వరగా ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది. శుభ్రమైన, గాలి చొరబడని పాత్రలో నిల్వ చేయడం ద్వారా బ్యాక్టీరియా వ్యాపించకుండా ఉంటుంది.

పిండి ముద్దను ఎక్కువ సేపు గది ఉష్ణోగ్రతలో ఉంచే బదులు, వీలైనంత త్వరగా ఫ్రిజ్‌లో పెట్టడం ఉత్తమం. దానిని శుభ్రమైన, మూత ఉన్న లేదా గాలి చొరబడని పాత్రలో నిల్వ చేయాలి. ఫ్రిజ్‌లో పెట్టడం ద్వారా సూక్ష్మజీవులు పెరగకుండా కాపాడుతుంది. అయితే ఇలా చేయడం ద్వారా పిండి ముద్ద సురక్షితంగా ఉంటుందని అనుకోవద్దు. నిల్వ ఉంచిన పిండి ముద్దను ఉపయోగించే ముందు తప్పనిసరిగా పిండి పరిస్థితిని తనిఖీ చేసుకోవాలి.
స్వీట్ ప్రేమికులకు పర్ఫెక్ట్ ట్రీట్..బాదం సేమియా పాయసం ఇలా చేశారంటే అదిరిపోతుంది!
ఈ లక్షణాలు ఉంటే
పిండి ముద్ద నిల్వ ఉంచిన తర్వాత వాడే ముందు ఈ లక్షణాలను తప్పనిసరిగా గమనించాలి. వింత లేదా ఘాటైన వాసన రావడం, ఫంగస్ రావడం, జిగురుగా ఉండటం, రంగు మారడం, మార్పులు కనిపిచడం, రుచిలో తేడా రావడం ఈ లక్షణాలు కనిపించినట్లయితే పిండిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. పడేయడం ఉత్తమం.
ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక వ్యవస్థ తక్కువగా ఉన్న వారు నిల్వ ఉంచిన పిండి ముద్దను పెట్టకూడదు. ఏ మాత్రం అనుమానంగా అనిపించినా, ఎక్కువ కాలం నిల్వ ఉన్నా, పాడైపోయినట్లుగా ఉన్నా ఆ పిండిని ఉపయోగించకూడదు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
