Latest Updates
-
రాజస్థానీ మటన్ కర్రీకి అంత క్రేజ్ ఎందుకు? ఈ సింపుల్ రెసిపీని ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది! -
మా దేశాన్ని అవమానిస్తావా? ఇటలీలో బంగ్లాదేశ్ వెయిటర్ కు చుక్కలు చూపించిన భారతీయ నారీమణులు -
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా.. మీకు కాబోయే భాగస్వామిలో ఈ సంకేతాలు చాలా డేంజర్.! -
ఆల్పైన్ డివోర్స్.. మహిళలను వణికిస్తున్న ఈ కొత్తరకం విడాకులు ఏంటి? -
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్‌కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.!
జ్యూసీగా,స్పైసీగా..ఇంట్లోనే ఈజీగా అదిరిపోయే చికెన్ తంగ్డీ కబాబ్
నాన్ వెజ్ ప్రియులకు చికెన్ తంగ్డీ కబాబ్ అంటే తెలియని వారు ఉండరు. రెస్టారెంట్లలో స్టార్టర్స్ మెనూ చూడగానే ముందుగా ఆర్డర్ చేసే వాటిలో ఇది ఒకటి. తంగ్డీ అంటే కోడి కాలు అని అర్థం. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉండే చికెన్ తంగ్డీ కబాబ్ ను ఇంట్లోనే రెస్టారెంట్ రుచితో ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
చికెన్ లెగ్ పీసెస్- 8
వెన్న- 3 చెంచాలు
నిమ్మరసం - 2 చెంచాలు
బొగ్గు ముక్క- స్మోకీ ఫ్లేవర్ కోసం
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 చెంచా
పసుపు - అర చెంచా
ఉప్పు - రుచికి సరిపడా
నిమ్మరసం - 1 చెంచా
కారం - అర చెంచా
గట్టి పెరుగు- 1 కప్పు (నీరు లేని పెరుగు)
వేయించిన శనగపిండి- 2 చెంచాలు
కాశ్మీరీ కారం - 1 చెంచా
గరం మసాలా - 1 చెంచా
ధనియాల పొడి - 1 చెంచా
జీలకర్ర పొడి - అర చెంచా
మిరియాల పొడి -అర చెంచా
కసూరి మేతి- 1 చెంచా
ఆవ నూనె- 2 చెంచాలు
నల్ల ఉప్పు- చిటికెడు

తయారీ విధానం
-ముందుగా చికెన్ లెగ్ పీసులను శుభ్రంగా కడగాలి. తర్వాత టిష్యూ పేపర్ తో తడి లేకుండా తుడవాలి. ఇప్పుడు కత్తితో ప్రతి ముక్కపై 3 లేదా 4 లోతైన గాట్లు పెట్టాలి.
-ఇప్పుడు ఒక గిన్నెలో చికెన్ ముక్కలను తీసుకుని, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, నిమ్మరసం వేసి బాగా కలిపాక సుమారు 30 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.
-వేరొక బౌల్లో గట్టి పెరుగు, వేయించిన శనగపిండి, కాశ్మీరీ కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కసూరి మేతి, నల్ల ఉప్పు, ఆవ నూనె వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఒక చిక్కటి పేస్ట్ తయారవుతుంది.
-ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను తీసుకుని తయారు చేసుకున్న మసాలా పేస్ట్ లో వేయాలి. ప్రతి ముక్కకు మసాలా మందపాటి పొరలా పట్టేలా చూడాలి. ఇప్పుడు ఈ గిన్నెపై మూత పెట్టి ఫ్రిజ్ లో కనీసం 6 గంటలు ఉంచాలి.
-తర్వాత స్టవ్ మీద దళసరిగా ఉన్న నాన్ స్టిక్ పాన్ పెట్టి అందులో 2 చెంచాల నూనె లేదా వెన్న వేయండి. చికెన్ ముక్కలను పాన్ లో వేసి, మూత పెట్టి మీడియం మంటపై 10-15 నిమిషాలు ఉడికించండి.
-తర్వాత మూత తీసి మంట పెంచి, ముక్కలను అన్ని వైపులా తిప్పుతూ ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి.
-ఒక చిన్న బొగ్గు ముక్కను ఎర్రగా కాల్చండి. ఉడికించిన చికెన్ ఉన్న గిన్నె మధ్యలో ఒక చిన్న గిన్నెపెట్టి అందులో కాలుతున్న బొగ్గును ఉంచండి.
-బొగ్గుపై అర చెంచా నెయ్యి వేసి వెంటనే గిన్నెపై గట్టిగా మూత పెట్టండి. ఆ పొగ చికెన్ ముక్కలకు పట్టి, అచ్చం హోటల్లో దొరికే తందూరీ రుచిని ఇస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications