kadapa karam dosa: కడప కారం దోశ విత్ బొంబాయ్ చట్నీ..జన్మలో మర్చిపోలేని టేస్ట్..ఇలా చేసుకోవాలి

Posted By:

మనదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతీయులు ఉదయం పూట ఎక్కువ తినే బ్రేక్ ఫాస్ట్ దోశ(dosa). దోశల్లో చాలా వెరైటీలు ఉంటాయి. దేనికదే ప్రత్యేకమైనదయినప్పటికీ కడప కారం దోశకు(kadapa karam dosa) మాత్రం స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఒంగోలు,నెల్లూరు,కడప జిల్లాల్లో కారం దోశల టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే కడప కారం దోశలో ఏదో తెలియని అద్భుతమే ఉంటుంది. కడప కారం దోశ అంత టేస్ట్ మిగతా ఏ దోశకి రాదనే చెప్పొచ్చు. ఎవరైనా కడప మీదుగా వెళ్తుంటే ఆగి ఒక కారం దోశ తప్పక తినాల్సిందే.

కడప జిల్లాలోని పొద్దుటూరు,మైదుకూరు ప్రాంతాల్లో కూడా దీని టేస్ట్ బాగుంటది. ఒక్కసారి కడప కారం దోశ తిన్నారు అంటే ఇక అది మీ ఫేవరెట్ లిస్ట్ లో చేరిపోతుంది.కడప కారం దోశను టేస్టీ చట్నీతో తినాలంటే అదృష్టం ఉండాలి ఎవరికైనా. అయితే ఆ అదృష్టం మీకు కావాలనుకుంటే ఇంట్లోనే ఈజీగా కడప కారం దోశను ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కడప కారం దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు

-మినపగుళ్లు
-దోశల బియ్యం
-మెంతులు
-జీలకర్ర
-నూనె
-నెయ్యి
-పుట్నాలపప్పు
-ఎండుమిర్చి
-ఉల్లిపాయ
-ఉప్పు
-అల్లం
-వెల్లుల్లి
-కరివేపాకు
-చింతపండు
-శనగపిండి
-శనగపప్పు
-పచ్చిమిర్చి
-పసుపు
-కొత్తిమీర

కడప కారం దోశ తయారీ విధానం

-మినపప్పు నాలుగు గంటలు ఓ బౌల్ లో నానబెట్టండి.

-నాలుగు గంటల తర్వాత అందులో 3 కప్పుల దోశల బియ్యం,ఓ టీస్పూన్ మెంతులు కలిపి వీటన్నింటిని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఎక్కువసేపు రుబ్బాలి. రోలు లేకుంటే మిక్సీలో వేసుకోండి.

-పిండి బాగా మృదువుగా అయిన తర్వాత దానిని ఓ బౌల్ లోకి తోడుకొని కనీసం 12 గంటలు నానబెట్టుకోండి.

-ఇప్పుడు కారం దోశల్లోకి కారం కోసం 20-25 ఎండుమిర్చిని వేడినీళ్లల్లో 15 నిమిషాలు నానబెట్టాలి.

-మిరపకాయలు నానేలోగా పప్పుల పప్పుల పొడి చేసుకోండి. అందుకోసం మిక్సీ జార్ లో 7 వెల్లుల్లి రెబ్బలు,అరకప్పు పుట్నాల పప్పు వేసి దాన్ని పొడి చేసుకోండి.

-ఇప్పుడు కారం చట్నీ కోసం 15 నిమిషాలు నానిన ఎండుమిర్చి,రుచికి సరిపడా ఉప్పు,ఒక టీస్పూన్ జీలకర్ర,రెండు పచ్చి ఉల్లిపాయ ముక్కలు పెద్దవి మిక్సీలో వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగా పేస్ట్ లా చేసుకోండి.

-12 గంటల తర్వాత పొంగిన దేశ పిండిని వేరే బౌల్ లోకి కొంచెం తీసుకోండి. అందులో సరిపడా ఉప్పు,నీళ్లు పోసుకొని కలుపుకోండి. మామూలు దోశ పిండి కంటే కడప కారం దోశ కోసం పిండి కొంచెం మందంగా ఉంటే బాగుంటది.

-ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకోని వేడి చేయండి. బాగా వేడెక్కాక పెనం మీద ఓ దోశ పిండి పోసి స్ప్రెడ్ చేసుకోండి. అంచుల వెంట ఓ టేబుల్ స్పూన్ నూనెు పోసి కాలనివ్వండి.

-దోశ మధ్యలో కొంచెం ఎర్రబడ్డాక దాని మీద ఓ టీస్పూన్ నెయ్యి వేసి స్ప్రెడ్ చేయడండి. అయితే నెయ్యి అనేది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు.

-ఇప్పుడు దోశ మీద ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దోశ కారం వేసి బాగా స్ప్రెడ్ చేయండి. ఆ తర్వాత దానిపై ఓ టీ స్పూన్ పప్పుల పొడి చల్లండి. అంతే రుచికరమైన కడప కారం దోశ రెడీ. దీన్ని ముందే రెడీ చేసుకున్న బొంబాయి చట్నీతో తింటే టేస్ట్ అదిరిపోతుంది.

బొంబాయ్ చట్నీ తయారీ విధానం
-బొంబాయ్ చట్నీ కోసం ముందుగా నిమ్మకాయ సైజు అంత నానబెట్టుకున్న చింతపండును ఓ బౌల్ లో వేసి బాగా పిసకండి.

-తొక్కంతా పడేసి పిసకగా వచ్చిన చింతపండు రసంలో 350 గ్రాముల నీళ్లు పోసుకోండి. అందులోనే రెండున్నర టేబుల్ స్పూన్ల శనగపిండి,రుచికి సరిపడా కల్లు ఉప్పే వేసి చేత్తో బాగా పలుచగా అయ్యేలా కలుపుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో రెండు టీస్పూన్ల ఆయిల్ పోసి వేడి చేసుకోండి. అందులో అర టీస్పూన్ ఆవాలు,ఓ టీస్పూన్ మినపప్పు వేసి ఎర్రగా వచ్చేలా వేపుకోండి.

-ఆ తర్వాత అందులో రెండు ఎర్ర మిర్చి,అర టీస్పూన్ జీలకర్ర,రెండు రెబ్బల కరివేపాకు అందులో వేయండి.

-తాలింపు అంతా వేగాక అందులో ఓ సన్నగా తరిగిన పచ్చిమిర్చి,అర టీస్పూన్ అల్లం తరుగు,రెండు చిటికెళ్ల పసుపు వేసి వేపుకోండి.

-ఇప్పుడు చింతపండు శనగప్పుతో కలిపిపెట్టి ఉంచుకున్న నీళ్లు అందులో పోసి కలుపుతూ బాగా మరిగించాలి.

-2 లేదా 3 నిమిషాలకు ఉడుకు వచ్చి రాగానే స్టవ్ ఆపేయండి. ఆ తర్వాత కాస్త కొత్తిమీర తరుగు అందులో వేసి కలుపుకొని దించేసుకోని ఒక నిమిషం తర్వాత కడప కారం దోశలో వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది.

[ of 5 - Users]
Story first published: Friday, November 29, 2024, 15:31 [IST]
Desktop Bottom Promotion