కాజు కట్లి అండ్ రబ్రీ చీజ్ కేక్

By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

ఇండియన్ డెసెర్ట్స్ అనేవి అద్భుతమైన ట్రీట్ వంటివి. ఇండియన్ వంటకాల గురించి వినగానే ప్రతిఒక్కరి హృదయం భారతీయత ఉట్టిపడే ఆ పసందైన భోజనాన్ని ఆస్వాదించాలని అభిలాషపడుతుంది. అందులోనూ, వాటికి డెసెర్ట్స్ జోడైతే వాటి రుచే వేరు. అటువంటి పసందైన ఇండియన్ డెసెర్ట్ గురించి ఇవాళ తెలుసుకుందాం. ఈ డెసెర్ట్ ని తయారుచేయడం ఎంతో సులభం. ఈ డెసెర్ట్ ని తయారుచేయడం తెలుసుకుని మీ ప్రియమైన వారికి సర్వ్ చేసి వారి నుంచి చక్కటి కాంప్లిమెంట్స్ ను పొందండి.

కొన్నేళ్ల పరిశోధనల తరువాత, పెర్ఫెక్ట్ కాజు కట్లి రబ్రీ చీజ్ కేక్ రెసిపీను చెఫ్ కనుగొన్నారు. ఈ డిష్ ఎంతో రుచికరంగా ఉంటుంది. డెసెర్ట్స్ లోనే ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది ఈ డిష్.

ఇటువంటి డిష్ ని మనం ఇంతకు ముందు ఆస్వాదించలేదని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఈ డెసెర్ట్ అనేది ప్రత్యేకమైన ఫ్లేవర్స్ తో అద్భుతమైన రుచితో మిమ్మల్ని కట్టిపడేస్తుంది. దీనిలోనున్న వైవిధ్యం ఏంటంటే ఈ డిష్ ఎంతో సులభంగా కుదురుతుంది.

షెఫ్ విశాల్ ఆత్రేయ చేత రూపొందింపబడిన కాజు కట్లి రబ్రీ చీజ్ కేక్ అనే ఈ రెసిపీ ఖచ్చితంగా మీకు మోస్ట్ ఫేవరేట్ డెసెర్ట్ గా మారుతుంది. ఒక్కసారి ప్రయత్నిస్తే, మీరు ఈ డెసెర్ట్ ని మళ్ళీ మళ్ళీ టేస్ట్ చేయాలని ఆశిస్తారు.

kaju katli and rabri cheese cake
కాజు కట్లి రబ్రీ చీజ్ కేక్ ! కాజు కట్లి రబ్రీ చీజ్ కేక్ ను ఎలా తయారుచేయాలి ! హోంమేడ్ కాజు కట్లి రబ్రీ చీజ్ కేక్
కాజు కట్లి రబ్రీ చీజ్ కేక్ ! కాజు కట్లి రబ్రీ చీజ్ కేక్ ను ఎలా తయారుచేయాలి ! హోంమేడ్ కాజు కట్లి రబ్రీ చీజ్ కేక్
Prep Time
30 Mins
Cook Time
1H0M
Total Time
1 Hours30 Mins

Recipe By: షెఫ్ విశాల్ ఆత్రేయ, ఎక్జిక్యూటివ్ షెఫ్, JW మారియట్

Recipe Type: డెసెర్ట్

Serves: 5

Ingredients
 • కాజు కట్లి - 7-10 పీసెస్

  క్రీమ్ ఛీజ్ - 1 కప్పు

  రబ్రీ - 1 కప్పు

  చక్కెర - 1 కప్పు

  గుడ్లు - 4

  ఇలాచీ పౌడర్ - 2 టీస్పూన్లు

  మైదా పిండి - 2 టేబుల్ స్పూన్లు

  విప్డ్ క్రీమ్ - గార్నిష్ కి తగినంత

Red Rice Kanda Poha
How to Prepare
 • 1. ఒక సిల్వర్ ఫాయిల్ ని తీసుకుని ఛీజ్ కేక్ చుట్టూరా కప్పివేయండి.

  2. ఒక ట్రే తీసుకుని సిల్వర్ ఫాయిల్ తో కప్పబడిన ఛీజ్ కేక్ ను అందులో ఉంచండి.

  3. ఒక ప్లేట్ నిండా కాజు కట్లిని తీసుకోండి.

  4. రింగ్ కింద భాగాన్ని కాజు కట్లి తో నింపండి.

  5. ఒక బౌల్ లో ఛీజ్ ని తీసుకోండి.

  6. ఛీజ్ ని క్రీమ్ లా తయారయ్యేలా బాగా కలపండి.

  7. ఇప్పుడు ఈ క్రీమ్ లో రబ్రీ ని జోడించండి.

  8. ఈ క్రీమ్ లో గుడ్లు, చక్కెరతో పాటు ఇలాచీని జోడించండి.

  9. ఇప్పుడు ఈ బౌల్ లో మైదాపిండిని జోడించండి.

  10. ఈ క్రీమ్ తో తయారైన మిశ్రమాన్ని ట్రేలో నున్న లైన్డ్ ఫ్రేమ్ పై పోయండి.

  11. క్రీమ్ ఛీజ్ మిశ్రమం కలిగిన లైన్డ్ ఫ్రేమ్ ని ఒవేన్ లో 150°Cలో ఒక గంట పాటు వాటర్ బాత్ ప్రాసెస్ లో బేక్ చేయండి.

  12. ఒక గంట తరువాత, ఈ మిశ్రమాన్ని ఓవెన్ లోంచి తీయండి.

  13. ఈ మిశ్రమం సాధారణ టెంపరేచర్ కి చేరేవరకు ఒక పక్కకి ఉంచండి.

  14. ఈ మిశ్రమం సాధారణ టెంపరేచర్ కి వచ్చిన తరువాత ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ లో రెండు నుంచి మూడు గంటల పాటు ఉంచాలి.

  15. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ లోంచి బయటకు తీయండి.

  16. ఈ ఛీజ్ కేక్ ను ముక్కలుగా తరగండి.

  17. కొంత విప్డ్ క్రీమ్ తో ఈ కేక్ ను గార్నిష్ చేయండి.

Instructions
 • క్రీమ్ ఛీజ్ మృదువుగా అయ్యేందుకు బ్యాటర్ ఇంగ్రీడియెంట్స్ ని 30 నిమిషాల వరకు రూమ్ టెంపరేచర్ లో ఉంచాలి.
Nutritional Information
 • సర్వింగ్ సైజ్ - 1 స్లైస్
 • కేలరీలు - 692 కేలరీలు
 • కొవ్వు - 58 గ్రాములు
 • ప్రోటీన్ - 18 గ్రాములు
 • కార్బోహైడ్రేట్స్ - 34 గ్రాములు
 • చక్కెర - 9 గ్రాములు
 • ఫైబర్ - 6 గ్రాములు -fiber
[ 3.5 of 5 - 56 Users]
Subscribe Newsletter