Latest Updates
-
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.!
ఈ వీకెండ్ కి నాన్‌వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా..
ప్రతిసారీ ఇంట్లో పనీర్ బటర్ మసాలా లేదా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాంటి రొటీన్ వంటకాలు తిని మీకు బోర్ కొట్టిందా? అయితే మీ వీకెండ్ భోజనానికి కాస్త కొత్తదనం తీసుకురావడానికి కమ్మని దాబా స్టైల్ కాజు మసాలా కర్రీని ట్రై చేయండి. చిక్కటి క్రీమీ గ్రేవీతో, సుగంధ ద్రవ్యాల గుమగుమలతో నోరూరించే ఈ వంటకం దాబా స్టైల్ రుచిని తలపిస్తుంది.
కాజు మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు
పేస్ట్ కోసం
ఉల్లిపాయలు - 3
జీడిపప్పులు - 40 నుంచి 45
గ్రేవీ కోసం
నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
వేయించడానికి జీడిపప్పులు - 45
నూనె - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
యాలకులు - 3
దాల్చినచెక్క - అంగుళం ముక్క
బిర్యానీ ఆకు - 1
వెల్లుల్లి తరుగు - 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - 2
ఉల్లిపాయలు - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్,
పసుపు - చిటికెడు
కశ్మీరీ కారం - 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి - 2 టీస్పూన్లు
జీలకర్ర పొడి - 1 టీస్పూన్
టమాటాలు - 4
ఉప్పు - రుచికి సరిపడా
కసూరి మెంతి - 1 టీస్పూన్
గరం మసాలా - కొద్దిగా
ఫ్రెష్ క్రీమ్ - 2 స్పూన్లు
కొత్తిమీర - తగినంత

కాజు మసాలా కర్రీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని మరిగించాలి. అందులో ఉల్లిపాయలు, జీడిపప్పులు వేసి 10-12 నిమిషాల పాటు పెద్ద మంటపై ఉడికించాలి. ఆ తర్వాత నీటిని వంపేసి, చల్లటి నీటితో ఒకసారి కడగాలి. వీటిని మిక్సీ జార్ లో వేసి, అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ మెత్తటి, క్రీమీ పేస్ట్ లా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని, నెయ్యి వేడిచేయాలి. అందులో జీడిపప్పులను వేసి, మంటను తగ్గించి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
-అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, యాలకులు, దాల్చినచెక్క, బిర్యానీ ఆకు, తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. వెల్లుల్లి పచ్చివాసన పోయాక, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించాక అల్లంవెల్లుల్లి పేస్ట్, పసుపు, కాశ్మీరీ కారం వేసి కలపాలి. ఇప్పుడు అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి నూనె లేదా నెయ్యి పైకి తేలేవరకు వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు లేదా ట్యూరీ, తగినంత ఉప్పు వేసి మూతపెట్టి 15 నిమిషాల పాటు సన్నని మంటపై మగ్గనివ్వాలి.
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ!
-టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత, ముందుగా రుబ్బిపెట్టుకున్న ఉల్లిపాయ జీడిపప్పు పేస్ట్ వేసి అడుగంటకుండా కలుపుతూ మరో 10 నిమిషాలు మీడియం మంట మీద ఉడికించాలి.
-గ్రేవీ చిక్కబడి నూనె పైకి తేలుతున్న సమయంలో.. ముందుగా నేతిలో వేయించిన జీడిపప్పులు, అరచేతిలో నలిపిన కసూరి మెంతి, గరం మసాలా, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలపాలి. మరో రెండు నిమిషాలు ఉడికించి, ఉప్పు కారం సరిచూసుకుని కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.
-అంతే ఎంతో ఘుమఘుమలాడే దాబా స్టైల్ కాజు మసాలా సర్వ్ చేయడానికి రెడీ. వేడివేడి నాన్, బటర్ రోటీ, చపాతీ లేదా జీరా రైస్‌లోకి ఈ కర్రీని తిన్నవారెవరైనా దీని రుచికి ఫిదా అవ్వాల్సిందే
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications