Latest Updates
-
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.!
Kambu dosa: కంబు దోసె ఎప్పుడైనా తిన్నారా? ఆరోగ్యానికి ఆరోగ్యం,టేస్ట్ కి టేస్ట్..ఎలా చేయాలంటే..
చాలా మంది భారతీయులు ముఖ్యంగా దక్షిణ భారతీయులు దోసె లేకుండా జీవించలేరు. రోజూ ఉదయం లేదా సాయంత్రం ఒక్కసారైనా దోసె తినడం మనకు అలవాటుగా మారింది. బియ్యప్పిండి దోసె తింటే రుచిగా ఉన్నా..పెద్దగా ప్రయోజనాలేవీ అందించవు. ఇలాంటప్పుడు దోసెను ఆరోగ్యకరమైన ఆహారంగా మార్చాలంటే దానికి కొన్ని గింజలు వేసి దోసె చేయడం వల్ల రుచితో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది. దోసె పిండిలో మిల్లెట్స్ జోడించి దోసెగా మార్చడం ఆరోగ్యకరమైన ఎంపిక. ఈ దోసె బరువు తగ్గడం, ఎముకలను బలోపేతం చేయడం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
ఇటీవల కాలంలో మిల్లెట్స్ ని ఎక్కువగా తింటున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత మిల్లెట్స్ కు ప్రాధాన్యం పెరిగింది. కొంత మంది వాటిని అల్పాహారంలా తీసుకుంటుండగా, మరికొందరూ రైస్ బదులు మిల్లెట్స్ నే తీసుకుంటున్నారు. ఎక్కువ మంది అల్పాహారంలా తీసుకోవడానికే మొగ్గుచూపుతున్నారు. అయితే దోసె రూపంలో వీటిని తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే మిల్లెట్స్ దోసె(దీనినే కంబు దోసె అని కూడా అంటుంటారు)తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
-మిల్లెట్స్
-బియ్యం
-మినపప్పు
-తరిగిన ఉల్లిపాయ
-తరిగిన కరివేపాకు
-అల్లం తురుము
-ఉప్పు
-నెయ్యి లేదా ఆయిల్
తయారీ విధానం
-ముందుగా ఓ పెద్ద గిన్నెలో సమాన మోతాదులో పెరల్ మిల్లెట్స్, బియ్యం
వేసి బాగా కడగాలి. మరొక గిన్నెలో మినపప్పును తీసుకొని బాగా కడగాలి.
ఇప్పుడు ఈ రెండింటి సుమారు నాలుగు గంటలు నానబెట్టండి.
-తర్వాత వీటిని గ్రైండర్ లో వేసి కొన్ని నీళ్లు పోస్తూ మెత్తగా రుబ్బుకోవాలి.
-ఇప్పుడు ఈ మెత్తటి పిండిని ఒక గిన్నెలో కలిపేసి ఒక వెచ్చని ప్రదేశంలో పులియబెట్టాలి.
-పులియబెట్టిన పిండిని దోశలు తయారు చేసేందుకు ఉపయోగించాలి. క్రిస్పీగా కాకుండా మెత్తగా కావాలనుకుంటే మరికొన్ని నీరు కలుపుకోండి అలాగే రుచికి తగినట్లుగా ఉప్పు కలుపుకోండి.
-పిండి బాగా కలిసినప్పుడు అందులో తరిగిన ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా కలపాలి. పిండిలో ముద్దలు లేకుండా చూసుకోవాలి.
-ఇప్పుడు దోస పెనంను వేడి చేసి నెయ్యితో లేదా నూనెతో అయినా గ్రీజ్ చేసి దోశలు వేసుకోండి. రెండు వైపులా దోశను మంచిగా కాల్చాలి. అంతే మిల్లెట్ దోసె రెడీ. కొబ్బరి చట్నీ లేదా మరేదైనా మీకు నచ్చిన చట్నీతో ఈ దోసెను ఆస్వాదించంవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
