Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
బెంగళూరు ఫేమస్ మష్రూమ్ దొన్నె బిర్యానీ..అస్సలు మిస్ అవ్వకండి..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే
దొన్నె బిర్యానీ... ఈ పేరు వినగానే మాంసాహార ప్రియులకు నోరూరే రుచి గుర్తొస్తుంది. అయితే అదే రుచి, సువాసనతో కూడిన వెజ్ దొన్నె బిర్యానీ కూడా తయారు చేసుకోవచ్చు. కర్ణాటకలోని బెంగళూరు ప్రాంతంలో పుట్టిన ఈ బిర్యానీ దొన్నెల (ఎండిన ఆకులతో చేసిన గిన్నెలు) లో వడ్డించడం వల్ల ఈ పేరును పొందింది. ప్రత్యేకమైన మసాలాలు, పుదీనా, కొత్తిమీరల కలయికతో పచ్చని రంగులో ఉండే ఈ బిర్యానీ, రుచిలోనే కాక ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.
ఎప్పుడూ తినే బిర్యానీలు బోర్ కొడితే ఓ సారి చిట్టిముత్యాలతో తయారయ్యే మష్రూమ్ దొన్నె బిర్యానీ ట్రై చేసి చూడండి. దీని రచి వేరే లెవల్లో ఉంటుంది. కర్ణాటక స్పెషల్ వెజ్ మష్రూమ్ దొన్నె బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-చిట్టి ముత్యాల బియ్యం
-పుట్టగొడుగులు
-నెయ్యి
-నూనె
-లవంగాలు
-బిర్యానీ ఆకు
-మిరియాలు
-యాలకలు
-రాతిపువ్వు
-జాపత్రి
-పుదీనా
-కొత్తిమీర
-పచ్చిమిర్చి
-దాల్చిన చెక్క
-షాజీరా
-స్టార్ అనాస
-ఉల్లిపాయ
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-ఉప్పు
-కారం
-పసుపు
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి అరటీస్పూన్ మిరియాలు, 5 లవంగాలు, 5 యాలకలు, 2 ఇంచుల దాల్చిన చెక్క వేసి 10 సెకన్లు వేయించాక 1కప్పు ఉల్లిపాయ చీలికలు వేసి బంగారు రంగు వచ్చేదాకా వేయించి స్టవ్ ఆపేయండి.
-ఇప్పుడు వేయించిన వీటన్నింటిని మిక్సీ జారులో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లో మిగిలిన నూనెలో 5 పచ్చిమిర్చి పెద్ద ముక్కలు వేసి, పిడికెడు పుదీనా ఆకులు, కాడలతో సహా పెద్ద కప్పు కొత్తిమీర తరుగు,పిడికెడు మెంతికూర ఆకు వేసి ఆకులన్నీ పసరు వాసన పోయేదాకా వేయించుకోవాలి. దీనికి 5 నిమిషాలు పడుతుంది.
-వేయించిన వీటన్నింటిని మిక్సీ జారులో వేసి నీళ్లు కలిపి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లోనే 4 టేబుల్ స్పూన్ల నూనె, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసి 5 లవంగాలు,1 టీస్పూన్ షాజీరా, 1 బిర్యానీ ఆకు, 2 అంగుళాల దాల్చిన చెక్క, అర టీస్పూన్ మిరియాలు, 5 యాలకలు, కొద్దిగా రాతిపువ్వు, చిన్న జాపత్రి,1 స్టార్ అనాస పువ్వు వేసి మసాలా దినుసులన్నింటినీ పొంగించకాలి.
-ఇప్పుడు అందులో కప్పుంబావు ఉల్లిపాయ చీలికలు వేసి ఎర్రగా వేయించుకోవాలి.
-తర్వాత అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
-తర్వాత అందులో 200 గ్రాములు మధ్యలోకి చీరుకున్న పుట్టగొడుగులు వేసి,రుచికి సరిపడా ఉప్పు, 1 టీస్పూన్ కారం,పావు టీస్పూన్ పసుపు వేసి పుట్టగొడుగుల్లోని నీరు దిగిపోయేదాకా వేయించాలి.
-పుట్టగొడుల్లో నుంచి నీరు వదలడం మొదలైనప్పుడు అరకప్పు పెరుగు అందులో వేసి బాగా కలపాలి.
-పుట్టగొడుగుల్లో నుంచి ఆయిల్ పైకి తేలాక అందులో మొదట గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ మసాలా పేస్ట్ వేసి కలపి 3 నిమిషాలు వేయించాలి.
-తర్వాత అందులో గంటసేపు నానబెట్టిన 2 కప్పుల చిట్టి ముత్యాల బియ్యం వేసి బియ్యంలోని చెమ్మ ఆరేదాకా నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకోవాలి.
-తర్వాత అందులో గ్రైండ్ చేసుకున్న ఆకుల పేస్ట్ ను వేసి బియ్యంలో 3-4 నిమిషాలు వేయించాలి.
-తర్వాత 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు చోప్పున మొత్తం 4 కప్పుల వేడి నీళ్లు అందులో పోసి కలిపి మూతపెట్టి పెద్ద మంట మీద 7-8 నిమిషాలు ఉడికించాలి.
-అన్నం దగ్గరపడుతున్న సమయంలో మూత తీసి కలిపి మళ్లీ మూతపెట్టి తక్కువ మంటమీద 10 నిమిషాలు ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆపేసి మూతతీయకుండా పావు గంట సేపు వదిలేయండి. తర్వాత మూత తీస్తే ఇళ్లంతా ఘుమఘుమలాడే వాసన వస్తుంది. ఈ వెజ్ దొన్నె బిర్యానీ తింటుంటే స్వర్గమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications








