Latest Updates
-
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.!
కార్తీకమాసం స్పెషల్..ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా కూరలు చేసుకోడానికి టేస్టీ గ్రేవీ
హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఉన్న ప్రాముఖ్యత అసాధారణమైనది. ఇది ఆ పరమశివునికి మరియు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ నెల 21నుంచి కార్తీక మాసం ప్రారంభమైపోయింది. కార్తీక మాసంలో ఆహార నియమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఈ నియమాలలో ముఖ్యమైనది ఉల్లిపాయ, వెల్లుల్లిలను పూర్తిగా త్యజించడం.
కార్తీకమాసంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చాలామంది కూరలు చేసుకుంటారు. ఉల్లి,వెల్లుల్లి లేకుండా ఒక్క గ్రేవీ చేసుకుంటే ఏ కాయగూరల్లోకి అయినా ఈ గ్రేవీ వేసుకొని కూరలను చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఉల్లి,వెల్లుల్లి లేకుండా గ్రేవీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఆయిల్
-టమాటో
-ధనియాల పొడి
-గసగసాలు
-జీడిపప్పు
-పసుప్పు
-కారం
-పసుపు
-కసూరి మేథీ
-గరం మసాలా
-అల్లం
-మిరియాలు
-జీలకర్ర
-బిర్యానీ ఆకులు
-దాల్చిన చెక్క
-లవంగాలు
-యాలకలు
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో పావు కప్పు ఆయిల్ వేసి వేడెక్కాక ఇందులో 2 బిర్యానీ ఆకులు, 3 ఇంచుల దాల్చిన చెక్క ముక్కలు, 10 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మిరియాలు 6 యాలకలు వేసి చిన్న మంటపై ఒక నిమిషం పాటు వేగనివ్వాలి.
-తర్వాత అందులో సన్నగా,పొడవుగా కట్ చేసిన 1 కేజీ టమాటో ముక్కలు, గుప్పెడు జీడిపప్పు, పొట్టు చెక్కి ముక్కలుగా కట్ చేసుకున్న 3 ఇంచుల అల్లం, 2 స్పూన్ల గసగసాలు వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మూతపెట్టేయాలి.
-టమాటో ముక్కల్లోని నీరు అంతా ఇగిరిపోయి ముక్కలు మెత్తగా మగ్గేవరకు ఉడకించుకోని స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ఉడికేటప్పుడ మధ్య మధ్యలో మూత తీసి కలుపుతుండాలి.
-బాగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో టమాటో మిశ్రమం వేసి గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు పోయకుండానే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో అరకప్పు ఆయిల్ వేసి వేడి చేశాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కసూరి మేథీ బాగా నలిపి వేసుకొని మెత్తం అంతా కలిసేలా 1 నిమిషం పాటు కలుపుతూ వేయించాలి. ఎక్కువ వేగితే కారం మాడిపోయి టేస్ట్ మారిపోతదని గుర్తుంచుకోండి.
-ఇప్పుడు అందులో గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. మూతపెట్టిసి చిన్న మంట మీద మధ్యమధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి వచ్చేదాకా కలుపుకోవాలి. దీనికి 20-25 నిమిషాల వరకు సమయం పడుతుంది. తర్వాత స్టవ్ ఆపేసి దాన్ని బాగా చల్లారనిచ్చి
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
