Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
కశ్మీరీ స్టైల్ ఫిష్ ఫ్రై.. టేస్ట్ వేరే లెవల్.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు
నాన్ వెజ్ లో చేపలకు ఉండే క్రేజ్ వేరు. చికెన్, మటన్ తినడానికి ఇష్టపడని వారు సైతం, చేపల వంటకాలను లొట్టలేసుకుంటూ తింటారు. దానికి ప్రధాన కారణం చేపల్లో ఉండే ప్రత్యేకమైన రుచి,సువాసన. సాధారణంగా మనం చేపలను ఇంటికి తెచ్చుకోగానే పులుసు లేదా మన సంప్రదాయ పద్ధతిలో మసాలాలు దట్టించి ఫ్రై చేస్తుంటాం.
కానీ ప్రతీసారీ ఒకే రుచిని ఆస్వాదించడం బోర్ కొడుతోంది కదా? అందుకే రెగ్యులర్ ఫిష్ ఫ్రైకి బదులుగా, నోరూరించే కశ్మీరీ స్టైల్ ఫిష్ ఫ్రైని ప్రయత్నించండి. మీరు ఇప్పటివరకు తిన్న చేపల వేపుడు వేరు.. ఈ కశ్మీరీ స్టైల్ వేరు. దీని రుచి వేరే లెవల్ లో ఉంటుంది. కశ్మీరీ స్టైల్ ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
చేప ముక్కలు - 1 కిలో
పసుపు - 1 టీస్పూన్
సాధారణ కారం - 2 టీస్పూన్లు
కాశ్మీరీ కారం - 1 టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
సోంపు పొడి - ఒకటిన్నర టీస్పూన్లు
జీలకర్ర పొడి - ఒకటిన్నర టీస్పూన్లు
గరం మసాలా - 1 టీస్పూన్
బియ్యం పిండి - 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు -సరిపడా
నూనె -సరిపడా
తయారీ విధానం
-ముందుగా చేప ముక్కలను పసుపు, ఉప్పు వేసి నీటితో రెండు, మూడు సార్లు శుభ్రంగా కడగాలి. దీనివల్ల చేపల నీచు వాసన పోతుంది.
-ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి. అందులో పసుపు, సాధారణ కారం, కాశ్మీరీ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోంపు పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు, బియ్యం పిండిని వేసి కలపండి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లి, మిశ్రమాన్ని చిక్కటి పేస్ట్ లా తయారు చేసుకోండి.
-ఇప్పుడు శుభ్రం చేసిన చేప ముక్కలకు ఈ మసాలా పేస్ట్ ను అన్ని వైపులా బాగా పట్టించండి. మసాలా దట్టించిన చేపలను కనీసం 45 నిమిషాల నుండి 1 గంట పాటు పక్కన పెట్టండి. ఫ్రిజ్ లో పెడితే మసాలా ముక్కల లోపలికి బాగా ఇంకి రుచి అద్భుతంగా ఉంటుంది.
-తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం కడాయి పెట్టి నూనె వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత మంటను మీడియంలో పెట్టి చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేయండి.
-చేపలు వేగుతున్నప్పుడు వాటిపై కొద్దిగా కాశ్మీరీ కారం పొడి, సోంపు పొడిని చిలకరించండి. ఇది ఈ వంటకం అసలైన సీక్రెట్. దీనివల్ల మంచి సువాసన వస్తుంది.
-ముక్కలు రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోండి. ఇలా చేయడం వల్ల చేప ముక్కలు బయట కరకరలాడుతూ, లోపల జ్యూసీగా, మృదువుగా ఉడుకుతాయి.
-అంతే వేడి వేడి కాశ్మీరీ ఫిష్ ఫ్రై రెడీ. వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications