Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
కేరళ స్పెషల్ బెల్లం అప్పాలు..రుచి అమోఘం..ఎలా చేసుకోవాలంటే
బెల్లం, బియ్యం పిండి, నెయ్యి వంటి సహజ పదార్థాలతో తయారుచేసే ఈ అప్పాలు శారీరక శక్తిని పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఈ అప్పాలు బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండి ఒక ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి. బెల్లం అప్పాలు తయారుచేయడం కొంచెం శ్రమతో కూడిన పని అయినా, వాటి రుచి ముందు ఆ శ్రమ ఏ మాత్రం లెక్కలోకి రాదు. అయితే ఈసారి కొంచెం ఢిఫరెంట్ గా కేరళ స్టైయిల్ లో టేస్టీ బెల్లం అప్పాలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
బెల్లం అప్పాలు తయారీకి కావాల్సిన పదార్ధాలు
బియ్యం - 1 కప్పు
ఉడికించిన అన్నం - పావు కప్పు
తురిమిన కొబ్బరి - పావు కప్పు
జీలకర్ర - 1 టీస్పూన్
నీళ్ళు-సరిపడా
బెల్లం పొడి - 1 కప్పు
నెయ్యి - 1 టేబుల్‌స్పూన్
ఉప్పు - పావు టీస్పూన్
యాలకుల పొడి - పావు టీస్పూన్
వంటసోడా - పావు టీస్పూన్
కొబ్బరి నూనె - 1 టేబుల్ స్పూన్
బెల్లం అప్పాలు తయారీ విధానం
-బెల్లం అప్పాలు తయారీ కోసం ముందుగా ఓ పెద్ద గిన్నె తీసుకొని అందులో బియ్యం వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడిగి నీళ్లు పోసి కనీసం 5 గంటలు నానబెట్టుకోవాలి.
-తర్వాత మిక్సీ జార్ లో నానబెట్టినబియ్యంతో పాటు ఉడికిన అన్నం, జీలకర్ర, కొబ్బరి తురుము, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని
-తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో బెల్లం తరుము, నీళ్లు పోసి కరిగిన తర్వాత కొంతసేపు మరిగించి స్టవ్ ఆప్ చేసి చల్లారనివ్వాలి.
-తర్వాత వేరే పాన్ ని స్టవ్ మీద పెట్టి అందులో నెయ్యి, తరగిన కొబ్బరి ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేదాకా వేయించుకోవాలి.
-బెల్లం పాకం చల్లబడిన తర్వాత దానిని వడకట్టి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి మిశ్రమంలో కలుపుకోవాలి. ఇందులోనే ఉప్పు, యాలకల పొడి, వంటసోడా వేసి బాగా కలుపుకున్నాక నెయ్యిలో వేయించిన కొబ్బరి ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద లోతైన బాండీ పెట్టి అందులో కొద్దిగా కొబ్బరి నూనె వేసి నూనె వేడయ్యిక అందులో ఒకటిన్నర గరిట పిండి మిశ్రమం వేసి దానిమీద మూతపెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి.
-తర్వాత మూతతీసి తిరగేసి రెండో వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. పిండిమొత్తాన్ని ఇలా ఒక్కొక్కటిగా చేసుకోవాలి. అంతే బెల్లం అప్పాలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications





