Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
కేరళ స్టైల్ రొయ్యల వేపుడు.. మసాలా ఇలా దట్టించారంటే కారం నషాళానికి అంటాల్సిందే.!
సీ ఫుడ్స్ అంటే నాన్ వెజ్ ప్రియులకు ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. చికెన్, మటన్ కంటే కూడా ఇష్టంగా లాగించేస్తారు. ఇక రొయ్యల విషయానికొస్తే వేపుళ్లను ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రొయ్యలను మన రొటీన్ స్టైల్‌లో కాకుండా ఇలా కేరళ స్టైల్‌లో మసాలాలు దట్టించి చేసి వండి చూడండి. ఘాటుగా ఉన్నా ఇంకా ఇంకా కావాలంటూ లాగించేస్తారు.

కేరళ రొయ్యల వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు
రొయ్యలు- 600 గ్రాములు
చిన్న ఉల్లిగడ్డలు- 15
వెల్లుల్లి- 10
నల్ల మిరియాలు- టీస్పూన్
సోంపు- టీస్పూన్
పసుపు- టీస్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
కశ్మీరీ ఎర్ర కారం- రెండు టేబుల్ స్పూన్లు
చిల్లీ ఫ్లేక్స్- 2 టేబుల్ స్పూన్లు
నూనె- 4 టేబుల్ స్పూన్లు
కరివేపాకు- రెండు రెబ్బలు
కేరళ రొయ్యల వేపుడు తయారీ విధానం
ముందుగా రొయ్యలను శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా ఆరబెట్టాలి.
ఇప్పుడు చిన్న ఉల్లిగడ్డలను పొట్టు తీసి కడిగి పెట్టుకోవాలి. వీటిలో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, సోంపు, పసుపు, ఉప్పు, కారం వేసి నీళ్లు పోయకుండా మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.
కడిగి పెట్టుకున్న రొయ్యల్లో చిల్లీ ఫ్లేక్స్‌ను చల్లుకోవాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా ముద్దను ఈ రొయ్యల్లో కలుపుకోవాలి. ఒక పదిహేను నిమిషాల పాటు మారినేట్ చేసుకోవాలి. దీంతో మసాలాలు అన్నీ రొయ్యలకు బాగా పడతాయి.
స్టవ్‌పైన మందపాటి వెడల్పాటి పెనం పెట్టుకోవాలి. ఇందులో నూనె వేసి కాగనివ్వాలి.

నూనె కాగిన తర్వాత కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు మారినేట్ చేసుకున్న రొయ్యలను ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి.
రొయ్యలను రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. మాడిపోకుండా, చినిగి పోకుండా, పాన్‌కి అంటుకోకుండా పదే పదే రొయ్యలను పైకి కిందికీ తిప్పుతూ ఉండాలి. అన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి!
ఈ రొయ్యల వేపుడు సాధారణ రైస్‌కి అయినా, బిర్యానీ రైస్‌లోకి అయినా సూపర్‌గా ఉంటుంది. మిరియాల ఘాటు, కశ్మీరీ కారం ఇచ్చే స్పైసీ నెస్‌తో జన్మలో ఈ రుచి మరిచిపోలేరు.
వర్షాకాలంలో తాజా రొయ్యలు, రకరకాల రొయ్యలు మార్కెట్‌లో విపరీతంగా దొరుకుతాయి. ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా అయిపోయే ఈ రొయ్యల వేపుడుని తప్పకుండా ట్రై చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
