Latest Updates
-
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.!
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
చికెన్ తో ఎప్పుడూ చేసుకునే రెగ్యులర్ చికెన్ కూరలు, ఫ్రైలు తిని బోర్ కొట్టిందా? ఒక్కసారి కోడి కొబ్బరి కారం వంటకాన్ని చేసి టేస్ట్ చేశారంటే ఇన్నాళ్లు ఇంత రుచికరమైన వంటకాన్ని ఎలా మిస్ అయ్యామబ్బా అంటూ అనుకొని తీరాల్సిందే.
వేడి వేడి అన్నంలోకి గానీ, బిర్యానీ, చపాతీల్లోకి గానీ ఇది అద్భుతంగా ఉంటుంది. ముక్క మెత్తగా, జ్యూసీగా చూస్తూనే నోట్లో నీళ్లూరిపోయేలా ఉంటది. టేస్టీ కోడి కొబ్బరి కారం మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కోడి కొబ్బరి కారం తయారీకి కావాల్సిన పదార్థాలు
ఎండుమిర్చి - 5
అల్లం - 1 అంగుళం ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 10
ఉల్లిపాయ - 1
ఉప్పు - రుచికి తగినంత
పసుపు - పావు టీస్పూన్
కారం - 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
చికెన్ - ముప్పావు కేజీ
నిమ్మకాయ - 1 చెక్క
నూనె - 4 టేబుల్ స్పూన్లు
తురిమిన పచ్చి కొబ్బరి - 1 కప్పు
కరివేపాకు - కొద్దిగా
కొత్తిమీర - కొద్దిగా
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
కోడి కొబ్బరి కారం తయారీ విధానం
-ముందుగా చికెన్ ను ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ చికెన్ లో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా నిమ్మరసం పిండి ముక్కలకు మసాలా బాగా పట్టేలా కలుపుకోవాలి. దీన్ని అరగంట పాటు పక్కన పెట్టుకోండి.
-ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తని పేస్ట్ లా మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోవాలి.
-స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి పాన్ పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల నూనె వేయండి. నూనె వేడయ్యాక మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను అందులో వేయాలి.
-ఈ రెసిపీ రుచిగా రావాలంటే ఒక చిన్న ట్రిక్ పాటించాలి. చికెన్ ముక్కలను పాన్‌లో వేసేటప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా మధ్యలో కొద్దిగా ఖాళీ ఉండేలా చూసుకోండి. ఇలా వెడల్పాటి పాన్ లో వేసి సెమీ డీప్ ఫ్రై చేయడం వల్ల చికెన్ అన్ని వైపులా సమానంగా వేగుతుంది. ముక్కలను అటూ ఇటూ తిప్పుతూ బాగా ఎర్రగా ఫ్రై చేయండి.
-చికెన్ ముక్కలు చక్కగా వేగి, మంచి రంగు వచ్చిన తర్వాత.. ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, అల్లం-వెల్లుల్లి, ఎండుమిర్చి పేస్ట్ ను ఇందులో వేయాలి. పచ్చివాసన పోయేలా సన్నని మంటపై బాగా వేయించుకోవాలి. ఈ సమయంలోనే కరివేపాకు వేసి కలుపుకోండి.
-మసాలా మొత్తం చికెన్ కు పట్టి నూనె పైకి తేలుతున్న సమయంలో.. 1 కప్పు తురిమిన పచ్చి కొబ్బరి వేసి బాగా కలుపుకోవాలి. కొబ్బరి వేగితే ఈ డిష్ కు వచ్చే రుచే వేరు.
-మరో ఐదు నిమిషాల పాటు రోస్ట్ చేసి, చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే నోరూరించే సరికొత్త కోడి కొబ్బరి కారం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
