Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ఘుమఘుమలతో..నోరూరించే ఖాన్ బిర్యానీ పక్కా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఇలా చేసేసుకోండి
మాంసాహార ప్రియుల్లో చికెన్ ను ఇష్టపడే వారు ఎక్కువ. చికెన్ తో వివిధ రకాలు వంటలు వండుతారు గ్రిల్డ్, బ్రెడ్, స్కేవర్డ్, సలాడ్‌లు మరియు డీప్-ఫ్రైడ్‌లో ఉపయోగించవచ్చు లేదా వివిధ గ్రేవీ బేస్‌లో ఉపయోగించవచ్చు. చికెన్ డిషెస్ రెసిపీలో నిజానికి లెక్కలేనన్ని వెర్షన్లు ఉన్నాయి.అందులో బిర్యానీ ఒకటి. చాలా మందికి బిర్యానీ అంటే ప్రాణం. అలాంటి వారిలో మీరు ఒకరు అయితే, ఈరోజు మీకోసం ఒక స్పెషల్ డిష్ పరిచయం చేస్తున్నాం. ఇది చాలా డిఫరెంట్ టేస్ట్ ను ఇస్తుంది. ఇందులో ఉపయోగించే మసాలా దినుసులు మనస్సులు ఆహ్లాదపరుస్తాయి. చూడగానే నోరూరిస్తుంది. ఈ చికెన్ బిర్యానీ నార్మల్ బిర్యాని కంటే డిఫరెంట్ గా ఉంటుంది. తయారుచేయడం కూడా డిఫరెంట్ గా ఉంటుంది.
దీని స్పెషాలిటీ ఏంటంటే అన్నం వండిన తర్వాత అన్నం చెకెన్ లేయర్స్ గా వేసి తర్వాత బిర్యానీని 30-45 నిముషాలు దమ్ చేసి వండుతారు. ఇదే దీని స్పెషాలిటి. అంచం ముస్లీంలు తయారుచేసే బిర్యానీలా ఉంటుంది. కాబట్టి ఈ బిర్యానీకి ఖాన్ చికెన్ బిర్యానీ అని పేరు పెట్టడం జరిగింది. మరి ఈ నోరూరించే చికెన్ బిర్యానీ ఎలా తాయరుచేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* చికెన్ - 1kg
* బాస్మత బియ్యం - 1/2kg
* పసుపు పొడి - 1/4 టీస్పూన్.
* కారం పొడి - 1 టీ స్పూన్.
* ధనియాల పొడి - 2 టీ స్పూన్.
* గరం మసాలా పొడి - 1 టీ స్పూన్.
* అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్.
* నిమ్మరసం - 1టీస్పూన్
* నూనె - 4 టేబుల్ స్పూన్లు.
* పెరుగు - 2 కప్పులు.
* ఉల్లిపాయ -4 సంఖ్యలు. (సన్నగా తరిగినవి)
* మొత్తం గరం మసాలాలు (ఒక్కొక్కటి) - 5 సంఖ్యలు.(లవంగాలు, యాలకలు,
స్టార్ యానీస్, అనాసపువ్వు, మరాఠి మెగ్గ, దాల్చిన చెక్క,
కుంకుమపువ్వు0
* బిర్యానీ ఆకు - 3 సంఖ్యలు.
* పుదీనా ఆకులు - 1 కప్పు( సన్నగా తరిగినవి)
* కొత్తిమీర ఆకులు - 1 కట్ట(సన్నగా తరిగినవి)
* ఉప్పు - రుచికి సరిపడా
* ఫుడ్ కలర్ - చిటికెడు.
* గోధుమ పిండి - 1 కప్పు.
తయారుచేయు పద్ధతి:
1. ముందుగా ఒక మిక్సింగ్ గిన్నెలో ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు,
గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, నూనె వేసి బాగా
కలపాలి.
2. తరవాత చికెన్, పుదీనా ఆకులు వేసి చికెన్‌ని ఈ మసాలాలతో బాగా
రుద్దాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత చికెన్ ఫుల్ గా కవర్
అయ్యేట్లు పెరుగు పోసి, మసాల చెదిరిపోకుండా స్మూత్ గా కలిపి, రాత్రంతా
అలాగే ఫ్రిజ్‌లో పెట్టాలి.
3. తర్వాత మనం చికెన్ బిర్యానీ తయారుచేయడానికి ముందుగా మనకు వేయించిన
ఉల్లిపాయలు అవసరం అవుతాయి. అందుకోసం స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి
వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు వేసి బ్రౌన్
కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి.
4. ఇప్పుడు వేయించిన ఉల్లిపాయల నుండి సగం ఉల్లిపాయలను కప్పులోకి
తీసుకుని రాత్రి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమంలో వేసి,
స్మూత్ గా బాగా మిక్స్ చేయాలి.
5. తర్వాత గరం మసాలా కోసం సిద్దంగా ఉంచుకున్న వాటన్నింటిని ఒక క్లాల్
లో వేసి మూట కట్టి మ్యారినేట్ చేసిన చికెన్ మద్యలో ఉంచాలి. ఇలా చేయడం
వల్ల మీరు చికెన్ బిర్యానీకి అదనపు ఫ్లేవర్ వస్తుంది. నోటికి
అడ్డుపడకుండా వాటిని బిర్యానీ తయారుచేసిన వెంటనే ఆ మూటను అలాగే బయటకు
తిసేయవచ్చు.
6. ఇప్పుడు పెద్ద గిన్నెలో సరిపడా నీళ్ళు తీసుకుని బాగా మరిగే టప్పుడు
అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె, రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలి.
7. నీళ్లు బాగా మరుగుతున్న సమయంలో అరగంట ముందు కడిగి నానబెట్టిని
బియ్యాన్ని వేసి ఉడికించాలి. అన్నం యాభైశాతం ఉడికిందని మీరు
నిర్ధారించుకున్న తర్వాత గంజి వంపేయాలి.
8 గంజి వంపేసిన తర్వాత సగం ఉడికిన అన్నంను మ్యారినేట్ చికెన్ లో వేసి
మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఈ అన్నం లేయర్ మీద ముందుగా వేయించి
పెట్టుకున్న ఉల్లిపాయలను స్పెడ్ చేయాలి. తర్వాత కొద్దిగా పదీనా ఆకులు
వేయాలి.
9. ఇలా మిగిలిన అన్నం కూడా ఇలా రెండు మూడు సార్లు లేయర్స్ గా వేయాలి.
చివరగా కుంకుమపువ్వు కలర్ వేయాలి.
10. ఇప్పుడు చపాతీ పిండి తీసుకుని దారంలా పొడవుగా చేసి గిన్నె అంచులకు
అంటించి దాని మీద ప్లేట్ పెట్టి, దాని మీద బరువు పెట్టడం వల్ల ఆవిరి
బయటికి పోకుండా ఉంటుంది. దాంతో బిర్యానీ మంచి ఫ్లేవర్ తో
నోరూరిస్తుంటుంది. ఈ బిర్యానిని సుమారు 30 నుండి 45 నిమిషాలు ఆవిరి
మీద ఉడికించాలి. అంతే ఇప్పుడు ఖాన్ బిర్యానీ సర్వ్ చేయడానికి సిద్ధంగా
ఉంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications













