Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు!
సేమియా పాయసం, సేమియా ఉప్మా లేదా సేమియా కేసరి అనగానే మనందరికీ వెంటనే నోరూరుతుంది. పండుగలు, శుభకార్యాలు ఏదైనా మన ఇంట్లో ముందుగా గుర్తొచ్చే స్వీట్ సేమియాయే. అయితే మీరు ఎప్పుడైనా కిమామి సేమియా రుచి చూశారా? నవాబుల నగరమైన లక్నో వంటకాల్లో కిమామి సేమియాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. జూన్ 21న ఫాదర్స్ డే సందర్భంగా మ నాన్నకు ఈ స్ఫెషల్ స్వీట్ చేసి పెడితే ఈ రుచిని ఆయన జీవితాంతం మర్చిపోరు.

కిమామి సేమియా తయారీకి కావాల్సిన పదార్థాలు
సన్నని బనారసి కిమామి సేమియా - అర కిలో
పంచదార - ఒక కిలో
స్వచ్ఛమైన నెయ్యి - 200 గ్రాములు
జీడిపప్పు - 100 గ్రాములు
బాదం పప్పు - 50 గ్రాములు
ఎండు కొబ్బరి - సగం చిప్ప
పచ్చ యాలకులు - 7
మఖానా - 60 గ్రాములు
తియ్యని కోవా (ఖోయా) - 250 గ్రాములు
పాలు - ఒక లీటరు
కేవ్రా వాటర్ - ఒక టీస్పూన్
కిమామి సేమియా తయారీ విధానం
-ముందుగా కిమామి సేమియా కోసం మార్కెట్ లో దొరికే అత్యంత సన్నని బనారసి సేమియాను తీసుకోవాలి. ఇది ఆన్ లైన్ లో కూడా సులభంగా దొరుకుతుంది. సేమియాను చేత్తో చిన్న చిన్న ముక్కలుగా విరుచుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని, కొద్దిగా నెయ్యి వేయాలి. అందులో ఈ సేమియాను వేసి లేత బంగారు రంగు వచ్చేలా సన్నని మంటపై దోరగా వేయించి ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి.
-అదే బాండీలో కొద్దిగా నెయ్యి వేడి చేసి, యాలకులు వేయాలి. ఆ తర్వాత చక్కెర, ఒక లీటరు పాలు పోసి పాకం తయారు చేయడం ప్రారంభించాలి. ఈ మిశ్రమాన్ని తక్కువ మంట మీద సుమారు 2 గంటల పాటు ఓపికగా ఉడికించాలి.
-మరో వైపు ఒక చిన్న పాన్ లో నెయ్యి వేడి చేసి, మఖానాను కరకరలాడేలా వేయించుకోవాలి. అలాగే జీడిపప్పు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ నేతిలో వేయించాలి. ఎండు కొబ్బరిని కూడా దోరగా వేయించాలి. చల్లారాక మఖానా, కొబ్బరిని మిక్సీలో వేసి కాస్త కరకరలాడేలా బరకగా రుబ్బుకోవాలి. కోవాను కూడా కొద్దిగా వేయించి పెట్టుకోవాలి.
-పాల పాకం బాగా చిక్కబడిన తర్వాత, అందులో మనం ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్న సేమియా, వేయించిన కోవా, నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్, మఖానా పొడి అన్నీ వేసి బాగా కలపాలి. మంచి సువాసన కోసం కేవ్రా వాటర్ చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి.
-దీన్ని వెంటనే తినడం కంటే, మూతపెట్టి సుమారు ఒక గంట పాటు అలానే వదిలేయాలి. అప్పుడు సేమియా ఆ చిక్కటి పాకాన్ని పూర్తిగా పీల్చుకుని మరింత మృదువుగా మారుతుంది. అంతే నోట్లో వేసుకుంటే కరిగిపోయే లక్నో స్పెషల్ కిమామి సేమియా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications