Latest Updates
-
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.!
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి!
మిగిలిన అన్నంతో సాధారణంగా పులిహోర, లెమన్ రైస్ లేదా రెగ్యులర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుని తింటుంటాం. కానీ ఎప్పుడూ ఒకేలా కాకుండా కాస్త విభిన్నంగా, నోటికి రుచిగా ఏదైనా కొత్త వంటకం చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇండోనేషియా, మలేషియా, థాయ్ లాండ్ లోని గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ఇష్టంగా తినే నాసి గోరెంగ్ కంపుంగ్ ను రుచి చూడాల్సిందే. నాసి గోరెంగ్ అంటే ఫ్రైడ్ రైస్ అని, కంపుంగ్ అంటే గ్రామం అని అర్థం. అంటే ఇది అచ్చమైన పల్లెటూరి స్టైల్ ఫ్రైడ్ రైస్ అన్నమాట.

ఈ ఫ్రైడ్ రైస్ రుచికి ప్రధాన కారణం ఇందులో వాడే నెత్తాళ్లు (చిన్న ఎండు చేపలు). మీకు ఎండు చేపల ఫ్లేవర్ ఇష్టం లేకపోతే, దానికి ప్రత్యామ్నాయంగా రొయ్యలు వాడుకోవచ్చు. అదీ ఇష్టం లేని వారు కేవలం గుడ్లు వేసుకుని కూడా ఈ రైస్ తయారు చేసుకోవచ్చు.
ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సినవి
ఉల్లిపాయ - 1
వెల్లుల్లి - 10 రెబ్బలు
బాగా పండిన ఎర్ర పచ్చిమిర్చి - 2
ఉప్పు - పావు టీస్పూన్
ఉల్లికాడలు (స్ప్రింగ్ ఆనియన్స్) - కొద్దిగా
నూనె - 2 టేబుల్ స్పూన్లు
నెత్తాళ్లు (చిన్న ఎండు చేపలు) లేదా రొయ్యలు - కొద్దిగా
గుడ్లు - 3
ఉప్పు, మిరియాల పొడి - రుచికి సరిపడా
మిగిలిపోయిన అన్నం - 1 పెద్ద కప్పు
చిల్లీ ఫ్లేక్స్ - అర టీస్పూన్
సోయా సాస్ - అర టీస్పూన్

ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం
-ముందుగా మిక్సీ జార్ లో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పండిన మిరపకాయలు, కొద్దిగా ఉప్పు వేసి బరకగా రుబ్బుకోవాలి. చివరగా అందులో కొన్ని ఉల్లికాడలు వేసి ఒక్కసారి తిప్పి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి అయ్యాక, శుభ్రం చేసుకున్న నెత్తాళ్లు వేసి కరకరలాడే వరకు వేయించి ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.
-అదే నూనెలో ముందుగా రుబ్బి పెట్టుకున్న ఉల్లిపాయ-వెల్లుల్లి మసాలా పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించండి. మసాలా బాగా వేగాక, దాన్ని పాన్ లో ఒక పక్కకు నెట్టి, ఖాళీగా ఉన్న వైపు 3 గుడ్లను పగలగొట్టి వేయండి. గుడ్లపై కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లి మెత్తని భుర్జీ లాగా కలుపుకోండి.
-ఇప్పుడు అందులో మిగిలిపోయిన అన్నాన్ని వేసి మసాలా మొత్తం అన్నానికి పట్టేలా బాగా కలపండి. మంటను కాస్త పెంచి టాస్ చేయండి.
-చివరగా అందులో ముందుగా వేయించి పెట్టుకున్న నెత్తాళ్లు లేదా రొయ్యలు, చిల్లీ ఫ్లేక్స్, సోయా సాస్, సన్నగా తరిగిన ఉల్లికాడలు వేసి మరో రెండు నిమిషాల పాటు బాగా కలపండి. అంతే ఇండోనేషియన్ స్టైల్ ఫ్రైడ్ రైస్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
