Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
రాఘవ్ చద్దా స్పెషల్ మ్యాంగో షేక్.. ఐదు నిమిషాల్లో ఈజీగా చేసుకోండిలా..బరువు పెరిగే టెన్షన్ లేదు!
ఆమ్ ఆద్మీ పార్టీని వీడి గత వారం బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా కేవలం తన రాజకీయ చతురతతోనే కాకుండా, తన ఆకర్షణీయమైన లైఫ్ స్టైయిల్, అద్భుతమైన ఫిట్ నెస్ తోనూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. బిజీ రాజకీయ జీవితంలో ఉంటూనే, తన ఆరోగ్యం పట్ల ఆయన తీసుకునే శ్రద్ధ నెటిజన్లను సైతం ఆకట్టుకుంటుంది.

చాలామంది ఫిట్‌నెస్ అనగానే కఠినమైన డైట్ ఫాలో అవుతుంటారు. ఇష్టమైన ఆహారాలకు దూరంగా ఉంటారు. కానీ రాఘవ్ చద్దా రూటే సపరేట్. నేను అన్నీ తింటాను, దేన్నీ వదులుకోను అని ఆయన స్పష్టం చేస్తున్నారు. అయితే, తాను తినే ఆహారం ఆరోగ్యకరమైన పద్ధతిలో వండాలని, అలాగే ఎంత తింటున్నాం అనే దానిపైనే తన ఫిట్ నెస్ ఆధారపడి ఉందని చెబుతున్నారు.
వేసవి కాలం వచ్చేసిందంటే చాలు, మామిడి పండ్ల గుబాళింపులు అందరినీ ఊరిస్తాయి. రాఘవ్ చద్దాకు కూడా మామిడి పండ్లంటే ప్రాణం. అయితే మామిడి పండ్లు తింటే బరువు పెరుగుతామనే భయం చాలామందిలో ఉంటుంది. కానీ ఫిట్ నెస్ ను కాపాడుకుంటూనే మామిడి పండ్లను ఎలా ఆస్వాదించాలో రాఘవ్ ఒక ఇంటర్వ్యూలో వివరించారు. తన ఇంట్లో ప్రత్యేకంగా తయారు చేసుకునే హెల్తీ మ్యాంగో షేక్ రెసిపీని ఆయన చెప్పారు. సాధారణ ఆవు లేదా గేదె పాలకు బదులుగా బాదం పాలు వాడటం ఈ రెసిపీ స్పెషాలిటీ. దీనివల్ల ఇది లాక్టోస్ రహితంగా ఉండటమే కాకుండా, తక్కువ కేలరీలతో ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా స్పెషల్ మ్యాంగో షేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు
బాగా పండిన మామిడి పండు - 1 పెద్దది
పంచదార లేని బాదం పాలు - 1.5 కప్పులు
స్వచ్ఛమైన తేనె - 1 టీస్పూన్
యాలకుల పొడి - చిటికెడు
నానబెట్టిన చియా గింజలు - 2 టీస్పూన్లు
అలంకరణ కోసం: సన్నగా తరిగిన బాదం
ఐస్ క్యూబ్స్ - తగినన్ని
రాఘవ్ చద్దా స్పెషల్ మ్యాంగో షేక్ తయారీ విధానం
-ముందుగా మామిడి పండును శుభ్రంగా కడిగి, పైన ఉన్న తొక్కను తీసేయాలి. లోపల ఉన్న గుజ్జును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
-ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలు, చల్లటి బాదం పాలు పోయాలి. మంచి సువాసన కోసం చిటికెడు యాలకుల పొడి వేయాలి. తీపి కాస్త ఎక్కువగా కావాలనుకునే వారు ఒక టీస్పూన్ తేనెను కలుపుకోవచ్చు.
-ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ పట్టి, స్మూత్ షేక్ లాగా తయారు చేసుకోవాలి.
-ఒక గాజు గ్లాస్ తీసుకుని, ముందుగా అందులో నానబెట్టిన చియా గింజలను వేయాలి. ఆ తర్వాత సిద్ధం చేసుకున్న మ్యాంగో షేక్ ను పోయాలి. పైన ఐస్ క్యూబ్స్ వేసి, సన్నగా తరిగిన బాదం ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన మ్యాంగో షేక్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications