Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
రక్తహీనతకు చెక్, కండరాలకు బలం..ఐరన్,ప్రొటీన్ అధికంగా ఉండే పెసరపప్పు పాలకూర ఇడ్లీ..
ఉరుకులు పరుగుల జీవితంలో ఆరోగ్యకరమైన, రుచికరమైన, అలాగే త్వరగా తయారయ్యే బ్రేక్ ఫాస్ట్ కావాలని అందరూ కోరుకుంటారు. మీరు కూడా ఇలాంటి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఆప్షన్ కోసం చూస్తున్నట్లయితే పెసరపప్పు పాలకూర ఇడ్లీ బెస్ట్ ఆప్షన్. కార్బోహైడ్రేట్స్ తగ్గించి, ప్రోటీన్ పెంచే ఈ స్పెషల్ ఇడ్లీ మీ ఉదయాన్ని మరింత ఎనర్జిటిక్ గా మారుస్తుంది. ప్రోటీన్, ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉండే ఈ ఇడ్లీలు శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడమే కాకుండా, ఎక్కువసేపు ఆకలి వేయకుండా కడుపు నిండిన భావనను కలిగిస్తాయి.

పెసరపప్పు పాలకూర ఇడ్లీ తయారీకి కావలసిన పదార్థాలు
పొట్టు లేని పెసరపప్పు - 1 కప్పు
తరిగిన పాలకూర - 1 కప్పు
పచ్చిమిర్చి - 1 లేదా 2
అల్లం - ఒక చిన్న ముక్క
జీలకర్ర - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
ఈనో ఫ్రూట్ సాల్ట్ - 1 టీస్పూన్ (లేదా పావు టీస్పూన్ బేకింగ్
సోడా)
నూనె - ఇడ్లీ ప్లేట్లకు రాయడానికి
పెసరపప్పు పాలకూర ఇడ్లీ తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో పెసరపప్పును తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి సుమారు 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టాలి.
-పెసర పప్పు బాగా నానిన తర్వాత అందులోని నీటిని పూర్తిగా వడకట్టాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో నానబెట్టిన పెసరపప్పు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు చల్లుతూ మెత్తగా రుబ్బుకోవాలి. పిండి మరీ నీళ్లలా పల్చగా ఉండకూడదు.
-రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో సన్నగా తరిగిన పాలకూర, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
-ఇడ్లీలు వేయడానికి సరిగ్గా ఒక నిమిషం ముందు మాత్రమే పిండిలో ఈనో లేదా బేకింగ్ సోడా వేసి ఒకే దిశలో సున్నితంగా కలపాలి. ఇలా చేయడం వల్ల ఇడ్లీలు చాలా మృదువుగా, దూది లాంటి స్పాంజీ టెక్చర్ తో వస్తాయి.
-ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె రాసి, సిద్ధం చేసుకున్న పిండిని అచ్చులలో నింపాలి. ముందుగానే నీళ్లు పోసి వేడి చేసిన ఇడ్లీ పాత్ర లేదా స్టీమర్ లో ఈ ప్లేట్లను ఉంచి, మీడియం మంట మీద 10 నుండి 12 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి.
-ఉడికిన తర్వాత వెంటనే తీయకుండా, ఒక రెండు నిమిషాలు ఆగి ప్లేట్ల నుండి తీస్తే ఇడ్లీలు విరిగిపోకుండా వస్తాయి.
-వేడి వేడి పెసరపప్పు పాలకూర ఇడ్లీలను పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ లేదా పుదీనా చట్నీతో వడ్డిస్తే ఆ రుచే వేరు.

ఆరోగ్య ప్రయోజనాలు
కండరాల బలానికి: పెసరపప్పులో ఉండే అధిక ప్రోటీన్ కండరాల నిర్మాణానికి, దృఢత్వానికి అద్భుతంగా సహాయపడుతుంది.
రక్తహీనతకు చెక్: పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి రక్తహీనత దరిచేరకుండా కాపాడుతుంది.
బరువు నియంత్రణ: చాలా తక్కువ నూనెతో, ఆవిరి మీద ఉడికించి చేస్తారు కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు కడుపునిండా తినవచ్చు. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
