Latest Updates
-
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.!
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే..
స్పైసీ ఫుడ్ ఇష్టపడే వారికి మహారాష్ట్రలోని కొల్హాపూర్ వంటకాలు ఎంతో ఫేవరెట్. అందులోనూ అండా రస్సా (కోడిగుడ్డు పులుసు) రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. వేడి వేడి జొన్న రొట్టె లేదా అన్నంతో తింటే దీని రుచి అదుర్స్. సాధారణంగా ఈ సాంప్రదాయ వంటకంలో టమాటాలు వాడరు. కానీ టమాటాలు వేసి చేసే ప్రత్యేకమైన వెర్షన్ చాలామంది ఇష్టపడతారు. మీరు కూడా ఈ అద్భుతమైన వంటకాన్ని ఇంట్లో సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు తయారీకి కావాల్సినవి
ఉడికించిన కోడిగుడ్లు - 6
పెద్ద ఉల్లిపాయలు - 3
టమాటాలు - 2
ఎండు కొబ్బరి - అర కప్పు
వెల్లుల్లి రెబ్బలు - 8 నుండి 10
అల్లం - 1 అంగుళం ముక్క
పచ్చిమిర్చి - 2 లేదా 3
నల్ల యాలకులు - 1
లవంగాలు - 3
దాల్చిన చెక్క - 1 అంగుళం
జీలకర్ర - 1 టీస్పూన్
తెల్ల నువ్వులు - 1 టేబుల్ స్పూన్
పసుపు - అర టీస్పూన్
కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - 2 టీస్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 4 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - కొద్దిగా
నీళ్లు - గ్రేవీకి సరిపడా
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు తయారీ విధానం
ముందుగా ఒక ఇనుప కడాయి లేదా పెనం తీసుకుని, అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా మారేలా బాగా వేయించండి. ఆ తర్వాత అందులో ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, నల్ల యాలకు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, నువ్వులు, కొద్దిగా తాజా కొత్తిమీర వేసి మంచి సువాసన వచ్చే వరకు దోరగా వేయించండి. చివరగా టమాటా ముక్కలు కూడా వేసి, అవి మెత్తబడి రంగు మారే వరకు మగ్గనివ్వండి.
వేయించిన ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి.
ఉడికించిన కోడిగుడ్లను సగానికి కట్ చేయాలి. వాటిపై కొద్దిగా ఉప్పు, పసుపు, కారం చల్లి, పెనం మీద నూనె వేసి దోరగా, బంగారు రంగు వచ్చేలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
కడాయిలో నూనె వేడి చేసి, ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ ను వేసి వేయించాలి. మసాలా పచ్చివాసన పోయి నూనె పైకి తేలుతున్న సమయంలో పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి మరో 2-3 నిమిషాలు సన్నని మంటపై మగ్గనివ్వాలి.
ఇప్పుడు గ్రేవీకి తగినన్ని నీళ్లు (మరీ చిక్కగా కాకుండా, కొంచెం పల్చగా ఉండేలా) పోసి బాగా మరిగించాలి. గ్రేవీ ఉడుకుతున్నప్పుడు వేయించి పెట్టుకున్న గుడ్లను నెమ్మదిగా అందులో వేసి, 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించాలి.
చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. ఘుమఘుమలాడే కొల్హాపురి కోడిగుడ్డు పులుసు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
