Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
చేపల వేపుడిని మరిపించే మహారాష్ట్ర స్టైల్ అరటికాయ ఫ్రై..పప్పుచారు,సాంబార్ లోకి కేక..ఎలా చేసుకోవాలంటే
చాలామందికి భోజనం తినేటప్పుడు పప్పుచారు, సాంబార్ లోకి సైడ్ డిష్ గా నంజుకోవడానికి ఏదైనా ఉండి తీరాల్సిందే. ఎక్కువమంది బంగాళదుంప వేపుడిని సైడ్ డిష్ గా నంజుకోవడానికి తీసుకుంటుంటారు. పిల్లల నుంచి పెద్దల దాకా దాన్ని ఇష్టంగా తింటారు. అయితే ఎప్పుడూ అదే బంగాళాదుంప తిని తిని బోర్ కొట్టేసిందా? అయితే ఈసారి అరటికాయతో ఓ కొత్తగా ట్రై చేయండి. అరటికాయ వేపుడా? అదేం బాగుంటుందిలే అని అనుకుంటున్నారా?
ఒక్కసారి మహారాష్ట్ర పద్ధతిలో అరటికాయ వేపుడు చేసి చూడండి మీ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. దీని రుచి ముందు నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టపడే చేపల వేపుడు కూడా దిగదుడుపే. అంత అద్భుతంగా, కరకరలాడుతూ, మసాలా ఘాటుతో ప్రతి ముక్కా మిమ్మల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. మహారాష్ట్ర స్టైల్ లో పచ్చి అరటికాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావలసిన పదార్థాలు
-పచ్చి అరటికాయ - 1
-ఉప్మా రవ్వ - 1 టేబుల్ స్పూన్
-బియ్యప్పిండి - 1 టీస్పూన్
-శనగపిండి - 1 టేబుల్ స్పూన్
-కారం - 1 టీస్పూన్
-ధనియాల పొడి - 1 టీస్పూన్
-సోంపు పొడి - అర టీస్పూన్
-జీలకర్ర పొడి - అర టీస్పూన్
-ఎండుమిర్చి పలుకులు (చిల్లీ ఫ్లేక్స్) - అర టీస్పూన్
-మిరియాల పొడి - అర టీస్పూన్
-పసుపు - పావు టీస్పూన్
-చాట్ మసాలా - అర టీస్పూన్
-ఉప్పు - రుచికి సరిపడా
-నూనె - వేయించడానికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా పచ్చి అరటికాయ తొక్కను పూర్తిగా తీసి నీటిలో వేయండి. ఇప్పుడు దానిని మరీ పలుచగా కాకుండా, కొంచెం మందంగా పొడవాటి ముక్కలుగా అంటే ఫిష్ ఫ్రై ముక్కల్లా కోసుకోవాలి.
-కోసిన వెంటనే వాటిని ఉప్పు కలిపిన నీటిలో వేయాలి, లేకపోతే ముక్కలు నల్లబడిపోతాయి.
-తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలో రవ్వ, బియ్యప్పిండి, శనగపిండి, కారం, ధనియాల పొడి, సోంపు పొడి, జీలకర్ర పొడి, మిర్చి పలుకులు, మిరియాల పొడి, పసుపు, చాట్ మసాలా, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపండి.
-ఇప్పుడు నీటిలో నుండి అరటికాయ ముక్కలను తీసి వాటిపై తడి ఆరిపోకుండా చూసుకుని, మనం సిద్ధం చేసుకున్న మసాలా పొడిని బాగా పట్టించాలి. ప్రతి ముక్కకు మసాలా అంటుకునేలా చేత్తో నెమ్మదిగా రాయాలి.
-మసాలా పట్టించిన ముక్కలను 10 నిమిషాల పాటు పక్కన పెట్టి నాననివ్వాలి. దీనివల్ల మసాలాలోని రుచులు ముక్కలకు బాగా పడతాయి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ లేదా తవా పెట్టి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నూనె వేయండి.
-నూనె వేడయ్యాక మసాలా పట్టిన అరటికాయ ముక్కలను ఒక్కొక్కటిగా పాన్ పై పెట్టాలి. మంటను మీడియంలో ఉంచి ఒకవైపు బంగారు రంగులోకి, కరకరలాడేలా వేగాక, రెండో వైపుకు తిప్పి, అదే విధంగా వేయించుకోవాలి. అంతే నోరూరించే, కరకరలాడే మహారాష్ట్ర స్టైల్ అరటికాయ వేపుడు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
