Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
sankranti special recipe: సంక్రాంతి రోజు తప్పక తినాల్సిన వంటకం..ఎలా చేసుకోవాలో చూడండి
సంక్రాంతి పర్వదినాన చాలామంది ఖిచిడి తినే సంప్రదాయాన్ని పాటిస్తారు. మకర సంక్రాంతి రోజున మినపప్పుతో చేసే ఖిచిడి తినే సంప్రదాయానికి ప్రత్యేక మతపరమైన, జ్యోతిష్య ప్రాముఖ్యత కూడా ఉంది. బియ్యం, పప్పు, నెయ్యి, పసుపు, సుగంధ ద్రవ్యాలు, ఆకుపచ్చ కూరగాయలు వంటి ఖిచిడి ప్రధాన పదార్థాలు తొమ్మిది గ్రహాలతో సంబంధం కలిగి ఉన్నాయని నమ్ముతారు. వాటి వినియోగం శుభ ఫలితాలను తెస్తుందని వివ్వసిస్తారు. అయితే ఖిచిడిని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి, ఖిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ చూడండి.
మినపప్పు ఖిచిడి తయారీకి కావలసిన పదార్థాలు
-అరకప్పు బియ్యం
-1/4 కప్పు మినపప్పు
-అరకప్పు పచ్చి బఠానీలు
-అర అంగుళం అల్లం ముక్క
-4 ఎండుమిర్చి
-3 చెంచాల నెయ్యి
-2 పచ్చిమిర్చి
-1 టమోటా
-1 దాల్చిన చెక్క
-2 లవంగాలు
-చిటికెడు ఇంగువ
-ఏలకులు
-జీలకర్ర
-పసుపు
-ఉప్పు

ఖిచిడి తయారీ విధానం
-మినపప్పు ఖిచిడి చేయడానికి ముందుగా కుక్కర్ లో 2-3 స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయండి.
- ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, ఇంగువ, దాల్చిన చెక్క, లవంగాలు, ఎండుమిర్చి, యాలకులు వేసి చిన్న మంటపై వేయించాలి.
-మసాలాలు కాస్త వేగిన తర్వాత అందులో టమోటో ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, పచ్చిబఠానీలు వేసి వేయించాలి.
-టమాటోలు మగ్గిన తర్వాత పసుపు వేసి కలిపి అందులో మినపప్పు, బియ్యం వేసి కలపాలి.
-ఇప్పుడు అందులోనే ఎర్ర కారం, ఉప్పు వేసి అన్నీ కలిసేలా కలపండి.
- 2 నిమిషాలు కొద్దిగా ఉడికించిన తర్వాత కుక్కర్ లో 1.5 కప్పుల నీరు వేసి మూసివేయండి.
-1 విజిల్ వచ్చేదాకా అధిక మంట మీద ఉడికించాలి, ఆపై మీడియం మంట మీద మరో 1 విజిల్ వచ్చే దాకా ఉడికించుకోండి.
-ప్రెజర్ విడుదలయ్యే వరకు కుక్కర్ తెరవవద్దు. కుక్కర్ తెరిచినప్పుడు కిచిడీని కలపండి.
-అందులో కాస్త పచ్చి కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే రుచికరమైన మినపప్పు ఖిచ్డీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications