Latest Updates
-
బంగారు నగరమైన శ్రీలంకకు రావణాసురుడు రాజు ఎలా అయ్యాడో తెలుసా? -
మగాళ్లలో వంధ్యత్వానికి కారణం అండర్ వేర్ ఏనా? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజం! -
దీపావళికి స్పెషల్ స్వీట్.. కేవలం వేరుశెనగలతో నోట్లో వెన్నలా కరిగిపోయే పీనట్ హల్వా చేసుకోండిలా.. -
జీర్ణక్రియను మెరుగుపరిచే.. ఇడ్లీ, దోశలోకి అదిరిపోయే కొబ్బరి అల్లం చట్నీ చేసుకోండిలా.. -
Dhanteras 2026: ధనత్రయోదశి రోజు ఏ ముహూర్తంలో బంగారం కొనాలి? పూజా విధానం పూర్తి వివరాలు -
ఈ దీపావళికి ఇడ్లీలతో స్పైసీ బోటి పులుసు.. ఇలా చేస్తే రుచి అద్భుతం -
2027లో బంగారం ధర ఎంత ఉంటదో తెలుసా? బాబా వంగా సంచలన జోస్యం! -
ముంబై ఫేమస్ బాంబే ఐస్ హల్వా.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి -
జామ ఆకుల టీని రోజుకు ఒక్క కప్పు తాగితే చాలు.. ఈ 4 భయంకరమైన ఆరోగ్య సమస్యలు మాయం! -
అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్.. సొరకాయ కోఫ్తా కర్రీ ఇలా చేశారంటే కేక టేస్ట్!
బ్రెడ్ లేకుండా బ్రెడ్ పకోడీ చేయడం ఎలా? టేస్ట్ చూస్తే వావ్ అనాల్సిందే..
సాయంత్రం సమయంలో వేడిగా టీ తాగుతూ క్రిస్పీగా ఏదైనా తింటుంటే ఆ మజానే మేరు. చాలామంది టీ టైంలో స్నాక్ గా సమోసా, బజీలతో పాటు బ్రెడ్ పకోడీ కూడా ఎక్కువగా తింటారు. అయితే బ్రెడ్ లేకుండానే బ్రెడ్ పకోడీ ఎలా తయారాచేయాలో మీకు తెలుసా? బయట దొరికే మైదా బ్రెడ్ తినడం ఇష్టం లేకపోయినా, ఇంట్లో అప్పటికప్పుడు బ్రెడ్ అందుబాటులో లేకపోయినా.. అచ్చం బ్రెడ్ పకోడీను మించే రుచితో దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. సాధారణ పకోడీల కంటే ఇది ఎంతో ఆరోగ్యకరం, అలాగే లోపల ఉండే ఘుమఘుమలాడే మసాలా ఫిల్లింగ్ అత్యద్భుతంగా ఉంటుంది. బ్రెడ్ లేని బ్రెడ్ పకోడీ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
లోపలి మసాలా కోసం:
ఉడికించిన బంగాళదుంపలు - 4 లేదా 5
జీలకర్ర - అర టీస్పూన్
ధనియాలు - అర టీస్పూన్
ఇంగువ - చిటికెడు
కరివేపాకు - 4 లేదా 5 ఆకులు
అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ - 1 టీస్పూన్
కొద్దిగా చాట్ మసాలా
కారం
పసుపు
సన్నగా తరిగిన కొత్తిమీర
బేస్ కోసం (బ్రెడ్ కు బదులుగా):
బొంబాయి రవ్వ (సూజీ) - 1 కప్పు
పెరుగు - అర కప్పు
ఈనో - పావు టీస్పూన్
రుచికి సరిపడా ఉప్పు
పైన కోటింగ్ కోసం:
శనగపిండి - ఒకటిన్నర కప్పు
వాము - అర టీస్పూన్
చిటికెడు ఇంగువ
ఉప్పు
కారం

తయారీ విధానం
-ముందుగా ఒక బాండీలో కొద్దిగా నూనె వేడి చేయండి. అందులో జీలకర్ర, ధనియాలు, చిటికెడు ఇంగువ, కరివేపాకు వేసి దోరగా వేయించండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ఆ తర్వాత మెత్తగా చిదిమిన బంగాళదుంపలు, పసుపు, కారం, ఉప్పు, చాట్ మసాలా వేసి బాగా కలపండి. చివరగా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన ఫిల్లింగ్ రెడీ.
-తర్వాత మిక్సీలో బొంబాయి రవ్వను తీసుకుని మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోండి. దీనిలో అర కప్పు పెరుగు, అరకప్పు నీళ్లు పోసి బాగా కలిపి 15 నిమిషాల పాటు నాననివ్వండి. ఆ తర్వాత అవసరమైతే మరికొద్దిగా నీళ్లు పోసి ఇడ్లీ పిండిలా కలుపుకోండి. ఇందులో కొద్దిగా ఉప్పు, ఈనో వేసి.. వెంటనే ఒక వెడల్పాటి గిన్నెలో లేదా అచ్చులో పోసి 10-12 నిమిషాల పాటు ఆవిరి మీద (స్టీమ్) ఉడికించండి. ఇది అచ్చం బ్రెడ్ లాగా స్పాంజిలా తయారవుతుంది.
-ఒక గిన్నెలో శనగపిండి తీసుకోండి. అందులో వామును చేతులతో నలిపి వేయండి. తర్వాత ఇంగువ, పసుపు, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోస్తూ మరీ పలచగా కాకుండా, బజ్జీల పిండిలా చిక్కగా కలుపుకోండి.
దీపావళికి స్పెషల్ స్వీట్.. కేవలం వేరుశెనగలతో నోట్లో వెన్నలా కరిగిపోయే పీనట్ హల్వా చేసుకోండిలా..
-ఆవిరి మీద ఉడికించిన రవ్వ మిశ్రమం చల్లారాక, బ్రెడ్ స్లైస్ల మాదిరిగా చదరంగా ముక్కలు కోసుకోండి. ఒక ముక్కకు టొమాటో కెచప్, మరో ముక్కకు గ్రీన్ చట్నీ రాసి.. మధ్యలో ముందుగా సిద్ధం చేసుకున్న ఆలూ మసాలాను ఉంచండి. ఆ తర్వాత వాటిని త్రికోణాకారంలో కట్ చేసుకోండి.
-ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడిచేయండి. సిద్ధం చేసుకున్న ముక్కలను శనగపిండి మిశ్రమంలో ముంచి, కాగే నూనెలో వేయండి. రెండు వైపులా తిప్పుతూ కరకరలాడుతూ బంగారు రంగు వచ్చే వరకు వేయించండి.
-అంతే వేడి వేడి, కరకరలాడే బ్రెడ్ లేని బ్రెడ్ పకోడీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
