క్యారెట్‌తో చేసే రసగుల్లాలు ఎప్పుడైనా తిన్నారా? అసలు టేస్ట్ ఉంటుంది భయ్యా, ఎలా చేసుకోవాలంటే?

మన తెలుగు రాష్ట్రాల్లో క్యారెట్‌తో చాలా రకాల రెసిపీస్ చేస్తుంటారు. క్యారెట్‌తో చేసుకునే వంటకాల్లో క్యారెట్ హల్వా చాలా ఫేమస్. దీనిని ప్రతి ఇంట్లో తయారు చేసుకుంటూ ఉంటారు. ఇది తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే సులభమైన పద్దతిలో చేసుకోవచ్చు. అయితే క్యారెట్‌తో కేవలం క్యారెట్ హల్వా మాత్రమే కాకుండా, క్యారెట్ రసగుల్లాలు కూడా చాలా ఫేమస్. దీనిని చేసుకోవడం హల్వాను చేసుకునేదానికంటే చాలా సులభం. ఈ స్టోరీలో క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

క్యారెట్ - 250 గ్రాములు
పాలు - 500 ml
చక్కెర - 200 గ్రాములు
నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
యాలకుల పొడి - 1/2 టీస్పూన్
పిస్తా మరియు బాదం

Make caret rasagulla at home with these easy steps here is the complete recipe in telugu

క్యారెట్ రసగుల్లాలు తయారీ విధానం:

  1. ముందుగా క్యారెట్లను శుభ్రంగా కడిగి, పీల్ చేసి తురుముకోవాలి.
  2. ఒక పాన్‌లో పాలు పోసి వేడి చేయాలి. పాలు కొద్దిగా వేడయ్యాక తురిమిన క్యారెట్ మరియు చక్కెర వేసి బాగా కలపాలి.
  3. ఆ తరువాత క్యారెట్ మెత్తబడే వరకు బాగా ఉడికించాలి. దీనిని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
  4. పాలు చిక్కబడ్డాక నిమ్మరసం మరియు యాలకుల పొడి వేసి కలపాలి.
  5. మిశ్రమం చల్లారాక చిన్న ఉండలుగా చేసుకోవాలి.
  6. ఒక గిన్నెలో చక్కెర మరియు నీరు వేసి మరిగించాలి.
  7. మరిగే నీటిలో క్యారెట్ ఉండలను వేసి 10-15 నిమిషాలు ఉడికించాలి.
  8. రసగుల్లాలు చల్లారాక పిస్తా మరియు బాదంతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రసగుల్లాలు సిద్ధమైట్లే.
[ of 5 - Users]
Story first published: Saturday, February 1, 2025, 8:36 [IST]
Desktop Bottom Promotion